Breaking News

సిద్ధమవుతున్న వరి విత్తనాలు

Published on Thu, 01/30/2025 - 05:25

సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఖరీఫ్‌ సీజన్‌కు బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ కళాశాల క్షేత్రాల్లో వరి విత్తనాలు సిద్ధమవుతున్నాయి.  ఈ ఏడాది బాపట్ల నుంచి 2,550 క్వింటాళ్ల వరి విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా బీపీటీ రకాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. 128 ఎకరాల్లో వంగడాలను సాగు చేశారు. 

తేమ శాతం 12 వచ్చే వరకూ ఆరబెట్టి,  తర్వాత బ్యాగుల్లో నింపుతున్నారు. ఫిబ్రవరి రెండో వారా­నికి ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. మార్చి మొదటివారం నుంచి ప్రాసెసింగ్‌ మొదలు పెట్టి ఏప్రిల్‌ నాటికి నాణ్యమైన విత్తనాలను సిద్ధం చేయనున్నారు. మే నెల నుంచి ప్రభుత్వం, దేశవ్యాప్తంగా పలు సీడ్‌ కంపెనీలతోపాటు రైతులకు పంపిణీ చేస్తారు.

ఇక్కడ ఉత్ప­త్తి చేసిన బ్రీడర్‌ సీడ్‌ను నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌  తీసుకొని ఫౌండేషన్‌ సీడ్‌గా పునరుత్పత్తిచేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులకు అందజేస్తారు. ఏపీ సీడ్స్‌తోపాటు పలు ప్రైవేట్‌ కంపెనీలు సైతం ఇక్కడ ఉత్పత్తి చేసిన  బ్రీడర్‌ సీడ్‌ కొనుగోలు చేసి ఫౌండేషన్‌ సీడ్‌గా మార్చి రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు అందిస్తున్నాయి.

వ్యవసాయ పరిశోధన స్థానంలో 13 రకాల వంగడాలు
వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి బీపీటీ 2270, 2846, 2782, 2841, 2295, 2776, 2858, 2231, 2411, 3050, 2766, 3291, 2595 పేరుతో 13 రకాల వరి విత్తనాలను 20 ఎకరాల్లో సాగు చేశారు. వీటిని బ్రీడర్‌ సీడ్‌గా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాలు 400 క్వింటాళ్లు దిగుబడి వస్తాయని అంచనా. 

ఇవికాకుండా 7 ఎకరాల్లో బీపీటీ 2846, 2595 రకాలను ఫౌండేషన్‌ సీడ్‌గా ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి 150 క్వింటాళ్లు వస్తాయని అంచనా. ఏపీ సీడ్‌ సర్టిఫికేషన్‌తో మే నెల నుంచి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన సుమారు 60 కంపెనీలకు బ్రీడర్‌ సీడ్‌ ఇస్తారు.  మిగిలిన సీడ్‌ను ఇక్కడి రైతు­లకు అందజేస్తారు. ఫౌండేషన్‌ సీడ్‌ను జూన్‌లో రైతులకు విక్రయిస్తారు.

వ్యవసాయ కళాశాల నుంచి బీపీటీ 5204, 2270, 2782, 2595
బాపట్ల వ్యవసాయ కళాశాల క్షేత్రంలో బీపీటీ 5204, 2270, 2782, 2595 రకాల ఫౌండేషన్‌ సీడ్‌ను సుమారు 101 ఎకరాల్లో సాగుచేశారు. ఇక్కడ మొత్తం 2 వేల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఇప్పటికే మూడు రకాల విత్తనాల హార్వెస్టింగ్‌ పూర్తయింది. మిగిలింది ఫిబ్రవరి మొదటివారానికి పూర్తవుతుంది. మార్చిలో ప్రాసెసింగ్‌ మొదలుపెట్టి నాణ్యమైన విత్తనాలను సర్టిఫికేషన్‌ అనంతరం మేలో నేరుగా 3,500 మంది రైతులకు పంపిణీ చేస్తారు.

బీపీటీ 5204కు డిమాండ్‌
1986లో బాపట్లలోనే అభివృద్ధి చేసిన బీపీటీ 5204 రకం వరికి డిమాండ్‌ ఎక్కువ ఉంది. దీని పంటకాలం 140 నుంచి 145 రోజులు. బియ్యం తెలుపు రంగులో సన్నగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది. 1000 గింజల బరువు 14.5 గ్రాములు ఉండి అధిక దిగుబడినిస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో 20 లక్షల హెక్టార్లలో రైతులు ఈ రకాన్ని సాగుచేస్తున్నారు.

దేశవ్యాప్తంగా రైతులకు బీపీటీ విత్తనాలు
బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇప్పటివరకూ 15 రకాల వరి వంగడాలను ఉత్పత్తి చేశాం. ఈ ఏడాది 20 ఎకరాల్లో 13 రకాల బీపీటీ విత్తనాలను బ్రీడర్‌ సీడ్‌గా 7 ఎకరాల్లో 2 రకాలు ఫౌండేషన్‌ సీడ్‌గా ఉత్పత్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం 550 క్వింటాళ్లు మే నెలలో ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలకు సరఫరా చేస్తాం. మిగిలింది ఇక్కడి రైతులకు పంపిణీ చేస్తాం. – కృష్ణవేణి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ అండ్‌ హెడ్, వ్యవసాయ పరిశోధన స్థానం, బాపట్ల 

రైతులకోసం ఫౌండేషన్‌ సీడ్‌ ఉత్పత్తి
బాపట్ల వ్యవసాయ కళాశాల క్షేత్రంలో ఈ ఏడాది 101 ఎకరాల్లో బీపీటీ నాలుగు రకాలు ఫౌండేషన్‌ సీడ్‌గా ఉత్పత్తి చేశాం. హార్వెస్టింగ్‌ పూర్తయింది. మార్చిలో ప్రాసెసింగ్‌ మొదలుపెట్టి  మే నెల నాటికి పూర్తిచేస్తాం. సుమారు 2000 క్వింటాళ్ల విత్తనాలను వచ్చే సీజన్‌కు రైతులకు అందించాలన్నది లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా అవకాశమున్న మేర వరి విత్తనాలను పంపిణీ చేస్తాం.– అరుణ, సీనియర్‌ సైంటిస్ట్‌ అండ్‌ హెడ్, వ్యవసాయ కళాశాల క్షేత్రం, బాపట్ల

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)