Breaking News

క్షీణిస్తున్న పక్షుల జనాభా

Published on Sun, 10/05/2025 - 06:25

దేశంలో పక్షుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. ప్రధానంగా గడ్డి భూములు, చిత్తడి నేలల్లో కనిపించే పక్షులు 50 శాతం వరకూ తగ్గినట్లు సిటిజన్‌ సైంటిస్ట్‌ పోర్టల్‌ ఈ–బర్డ్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఈ–బర్డ్‌ ప్లాట్‌ ఫాం ద్వారా 30 వేల మంది పక్షి ప్రేమికులు దేశంలో పక్షుల కదలికలను గమనిస్తూ వాటి ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆ సమాచారాన్నంతా క్రోడీకరించి విశ్లేíÙంచగా దేశంలోని పక్షుల జనాభా, వాటి వైవిధ్యం ప్రమాదకర రీతిలో పడిపోతున్నట్లు తేలింది.

స్టేట్‌ ఆఫ్‌ ఇండియా బర్డ్స్‌ –2023 నివేదిక ప్రకారం దేశంలో 942 పక్షి జాతులున్నట్లు గుర్తించారు. తాజా అధ్యయనంలో వీటిలో 204 చాలా సంవత్సరాలుగా,  మరో 142 జాతులు ప్రస్తుతం తగ్గుతున్నట్లు తేలింది. మొత్తంగా 346 పక్షి జాతులు కనుమరుగయ్యే దశలో ఉన్నట్లు తేలింది. 29 శాతం జాతులు స్థిరంగా ఉండగా, 11 శాతం కొంచెం పెరిగాయి. తగ్గుతున్న వాటిలో 178 జాతులను కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సిటిజన్‌ సైంటిస్టులు సూచిస్తున్నారు. –సాక్షి, అమరావతి

తగ్గుతున్న జాతుల్లో వలస వచ్చేవే ఎక్కువగా ఉన్నాయి. సైబీరియా తదితర ప్రాంతాల నుంచి శీతాకాలంలో భారత్‌లోని పలు ప్రాంతాలకు వచ్చే పక్షుల రాక తగ్గిపోయింది. చిత్తడి నేలలు, గడ్డి భూములు, చెరువులు, పొదలు కుంచించుకుపోవడంతో వలస పక్షుల ఆవాసాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లోనే 50 శాతం పక్షులు తగ్గిపోయినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో 557 పక్షి జాతులు ఉన్నట్లు గుర్తించగా వాటిలో 50 శాతం తగ్గాయి. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో తరచూ  కనిపించేవి ఇప్పుడు మాయమయ్యాయి.

గడ్డి భూములు, చిత్తడి నేలలు పక్షుల ఆవాసాలు. అవి అధిక శాతం నాశనం కావడంతో  ఆహారం దొరకడం లేదు. పర్యావరణంలో వస్తున్న పెను మార్పులు, పెరిగిన కాలుష్యం, ఆక్రమణల కారణంగా చిత్తడి నేలలు, గడ్డి భూములు తగ్గిపోయాయి. పక్షుల ఆవాసాలు చెదిరి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ భూముల్లో ఉండే కీటకాలు, చిన్న జంతువులను తినే పక్షులు 25 శాతం కన్నా ఎక్కువ తగ్గాయి. పండ్లు, తేనె, తామరలు తినేవి మాత్రం స్థిరంగా ఉన్నాయి.

తగ్గిపోతున్న కొన్ని పక్షులు
1. బట్టమేక పక్షి (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌) 
2. పిచ్చుకలు (హౌస్‌ స్పారో) 
3. పాలపిట్ట (ఇండియన్‌ రోలర్‌) 
4. నల్ల మెడ కొంగ (బ్లాక్‌–నెక్డ్‌ స్టార్క్‌) 
5. గద్దలు (ఈగల్‌)

6. అమూర్‌ ఫాల్కన్‌ (వలస పక్షి) 
7. సైబీరియన్‌ కొంగ (సైబీరియన్‌ క్రేన్‌) 
8. నల్లతోక పక్షి, బ్లాక్‌–టైల్డ్‌ గాడ్‌విట్‌ 
9. నార్తర్న్‌ పింటెయిల్‌  
10. ఫ్లెమింగోస్‌

అతక్షణ చర్యలు అవసరం
పక్షి జాతుల సంరక్షణకు తక్షణం చర్యలు తీసుకోకపోతే మనుగడకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికీ పెనుముప్పు అని చెబుతున్నారు. గడ్డి భూములు, చిత్తడి నేలలను కాపాడడం, స్థానికులతో కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో పక్షుల వైవిధ్యం వేగంగా తగ్గిపోతోందని బెంగుళూరు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌కి చెందిన జీవ వైవిధ్య నిపుణుడు వివేక్‌ రామచంద్రన్‌ స్పష్టం చేశారు.  

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)