Breaking News

రూ.1.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత

Published on Tue, 02/11/2025 - 03:21

తాడేపల్లిగూడెం అర్బన్‌: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గంజాయి అక్రమ రవాణా(Ganja smuggling) చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ విశ్వనాథ్‌(Vishwanath) సోమవారం తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రైల్వే గూడ్స్‌ షెడ్డు రోడ్డులో మోటారు సైకిల్‌ పార్కింగ్‌ వద్ద కొందరు వ్యక్తులు గంజాయిని తీసుకువెళ్తున్నారని సమాచారం రావడంతో ఆ ప్రాంతానికి వెళ్లి.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

వారి వద్ద నుంచి రూ.1.30 లక్షల విలువైన 13.288 కిలోల గంజాయిని స్వాదీనం(Ganja possession) చేసుకున్నట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లి శ్రీనివాస్, కరాటం బాలకృష్ణ, కంకిపాటి నాగరాజు, గుండుగోలు మురళి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ముసునూరి దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ విశ్వనాథ్‌ తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)