Breaking News

465 మంది చిరుద్యోగులపై కక్ష సాధింపు!

Published on Wed, 01/01/2025 - 03:47

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ఎచ్చెర్ల క్యాంపస్‌: వివిధ విభాగాల్లోని చిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను కొనసాగి­స్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే వేలా­దిమందిని ఉద్యోగంలోనుంచి తొలగించగా.. తాజాగా మంగళవారం మరో 465మందికి ఉద్వాసన పలికి కొత్త సంవత్సరంలోనూ వారికి చేదు అనుభవాన్ని  రుచి చూపించింది. 

వివరాల్లోకి వెళితే.. గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)తో పాటు కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ (కేజీహెచ్‌), విక్టోరియా గవర్నమెంట్‌ హాస్పిటల్‌ (వీజీహెచ్‌)లలో పనిచేసే 431 మంది మలేరియా సిబ్బందిని జనవరి 1వ తేదీ నుంచి పనిలోకి రావద్దంటూ జీవీఎంసీ ఆదేశాలు జారీచేసింది. 

గత 14 నెలలుగా రోజువారీ వేతనం ఆధారంగా పనిచేస్తున్న సాధారణ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీకావడంతో వారంతా ఆందోళన చెందు­తున్నారు. వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో మలే­రియా, డెంగ్యూ, చికున్‌ గున్యా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం వీరిని పనిలోకి తీసుకుంది. ఇప్పటికీ నగరంలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి.

ఈ నేపథ్యంలో వీరి సేవలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే, సీజన్‌ ముగిసినందున వీరి అవసరం లేదని పేర్కొంటూ తొలగిస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ హెల్త్‌ (సీఎంహెచ్‌వో) ఆదేశాలు జారీచేశారు.
 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలోనూ..
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 34 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఇకపై విధులకు హాజరు కావద్దంటూ ఆయా విభాగాల అధికారులు  తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బాధిత సిబ్బంది అధికారులను కలిసే ప్రయత్నం చేయగా వీసీ రజిని, రిజి­స్ట్రార్‌ సుజాత అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. 

ఏజీఎస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నా వర్సిటీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోగా.. వారి సేవలకు ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారమిచ్చారు. ఉద్యోగాలు కల్పి­స్తా­మని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఉన్న ఉపాధిని తీసేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో తమ పొట్టకొట్టవద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)