నదీజలం.. వృథా అధికం

Published on Tue, 12/10/2024 - 06:07

సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్‌ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు గోదావరి, కృష్ణా, వంశధార నదుల నుంచి 5,021.58 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. రాష్ట్రంలో ఆయా నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్‌)లలో వినియోగించుకున్న, రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటి కంటే నాలుగు రెట్లు అధికంగా కడలిలో కలిశాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. 

కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్‌ల పరిధిలోని రాష్ట్రాల్లోను విస్తారంగా వర్షాలు కురిశాయి. దాంతో ఈ నదులు వరద నీటితో పోటెత్తాయి. నీటి సంవత్సరం జూన్‌ 1న ప్రారంభమై... మే 31వ తేదీన ముగుస్తుంది. కేవలం ఆరు నెలల్లోనే 5,021.58 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలవడం విశేషం.

నదుల వారీగా నీటి వినియోగం.. సముద్రంలోకి వదిలిన జలాల వివరాలు...
ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్‌ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉద­య­ం 6 గంటల వరకు గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,266.53 టీఎంసీల ప్రవాహం రాగా... గోదావరి డెల్టాలో పంటల సాగుకు 136.28 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 4,130.25 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గరిష్టంగా గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూ­ము­లకు మళ్లించి సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంటుంది.


కృష్ణా నది నుంచి ప్రకాశం బ్యారేజీకి 1,006.36 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు 136.64 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 869.72 టీఎంసీలను బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌–) కేటాయించింది. ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు అంతకంటే ఎక్కువ నీరు సముద్రంలో కలవడం గమనార్హం.

వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 41.49 టీఎంసీలు వచ్చాయి. ఆయకట్టు పంటల సాగుకు 19.88 టీఎంసీలను వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 21.61 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. గొట్టా బ్యారేజీ వద్ద 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన వంశధార ట్రిబ్యునల్‌... ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం కేటాయించింది. వంశధార ట్రిబ్యునల్‌ అంచనా వేసిన దాని కంటే 73.51 టీఎంసీలు తక్కువగా వచ్చాయి. వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2 ప్రాజెక్టు కింద వంశధార జలాలను పూర్తి స్థాయిలో ఒడిసి పట్టాలంటే నేరడి బ్యారేజ్‌ లేదా వంశధార ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)