Breaking News

ఏపీలో 40 శాతం పెరిగినఉపాధి అవకాశాలు 

Published on Fri, 12/15/2023 - 05:34

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఏపీలో 2019లో 4.05 లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటే 2023 నాటికి 5.61 లక్షలకు చేరాయని తద్వారా 40శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయని టాలీ సొల్యూషన్‌ సౌత్‌ ఇండియన్‌ హెడ్‌ భువన్‌ రంజన్‌ చెప్పారు. గురువారం టాలీ ప్రైమ్‌ 4.0 సాఫ్ట్‌వేర్‌ను విశాఖలోని ఓ హోటల్‌లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లలో ఏపీలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దక్షిణ భారత్‌లో వ్యాపార విస్తరణకు ఏపీ అనుకూలంగా ఉందని, అందుకే విశాఖలో తమ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించామని తెలిపారు.

వచ్చే రెండేళ్లలో వంద ఎంఎస్‌ఎంఈ వ్యాపార క్లస్టర్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని, ఇది తమ వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో టాలీ సాఫ్ట్‌వేర్‌ను 50 వేల మందికి పైగా ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్య 4 లక్షలకు చేరుకునే అవకాశం తమ సంస్థకు లభిస్తుందన్నారు. ఈ టాలీ ప్రైమ్‌ 4.0లో ఆకర్షణీయమైన డ్యాష్‌బోర్డు, వాట్సప్‌ను అనుసంధానం, ఎంఎస్‌ ఎక్స్‌ఎల్‌ ఫైల్‌ను నేరుగా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేసే ఫీచర్‌ ఉంచినట్లు వివరించారు. టాలీపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు టాలీ ఎడ్యుకేషన్‌ 
సెంటర్లను ప్రతీ నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)