జగన్‌ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కొళాయిలు

Published on Mon, 02/10/2025 - 03:39

సాక్షి, అమరావతి: తాగు నీటి(Drinking water) కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దూర­ంలోని బావులు, చెరువుల నుంచి తోడి తెచ్చుకొంటుంటారు. అవీ ఎండితే నీరే దొరకని పరిస్థితి. గ్రామీణ ప్రజల దుస్థితిని అర్ధం చేసు­కున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(YS Jaganmohan Reddy).. నీటి కోసం ఇల్లు దాటి వెళ్లే అవసరం లేకుండా ఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రజల నీటి వెత­లను తీర్చారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని లోక్‌సభకు తెలిపింది.

కేంద్ర జల శక్తి శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ లోక్‌సభకు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్ల ఉన్నాయి. 2019 ఆగస్టు 15 వరకు.. అంటే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 72 సంవత్సరాల వరకు రాష్ట్రంలోని ప్రస్తుత 26 జిల్లాల పరిధిలో 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే అప్పటి ప్రభు­త్వాలు తాగు నీటి కొళా­యిలు ఏర్పాటు చేశాయి.

 2019లో వైఎస్‌ జగన్‌­ ప్రభు­త్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో కొత్తగా మరో 39.34 లక్షల ఇళ్లకు తాగు నీటి కొళాయిలు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 25.08 లక్షల ఇళ్లకు మాత్రమే కొళాయిలు ఏర్పాటు చేయా­ల్సి ఉందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 నెలల్లో కేవలం 36 వేల ఇళ్లకే కొళాయిలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
ఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన వేల కోట్ల రూపాయల విలువైన రక్షత మంచి నీటి పనులను రద్దు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటింటికీ తాగునీటి కొళాయి ఏర్పాటు చేసే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం మంజూరు చేసిన రూ. 11,400 కోట్ల రక్షిత తాగునీటి పథకాల పనులను రద్దు చేసింది. ఇదే­మని అడిగితే కొత్త అంచనాలు తయారు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తామంటూ సాకులు చెబుతోంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)