Breaking News

కొత్త వైద్య కళాశాలలకు 380 పోస్టుల మంజూరు

Published on Sat, 06/01/2024 - 05:04

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలకు 21 విభాగాల్లో 380 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను సీఎం జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, 2023–24 విద్యా  సంవత్సరంలో మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలను ప్రారంభించారు. 

2024–25 విద్య సంవత్సరంలో పాడేరు, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని కళాశాలలను ప్రారంభించనున్నారు. కళాశాలకు 222, బోధన ఆస్పత్రికి 484 చొప్పున గతంలోనే కొత్త పోస్టులను మంజూరు చేశారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, టీచింగ్‌ ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచడంలో భాగంగా తాజాగా మరో 380 పోస్టులను మంజూరు చేశారు. 

60 ప్రొఫెసర్, 85 అసోసియేట్‌ ప్రొఫెసర్, 75 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 160 ఎస్‌ఆర్‌/ట్యూటర్‌ పోస్టులకు కొత్తగా మంజూరు చేసిన వాటిలో ఉన్నాయి. కాగా,  2024–25 విద్య సంవత్సరంలో ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా శుక్రవారం 130 మంది ట్యూటర్, 37 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) నియామక ఉత్తర్వులిచ్చింది. 

కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సరీ్వసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ ఇచ్చింది. నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల జాబితాలను డీఎంఈకి అందజేయగా వీరికి పోస్టింగ్‌లు ఇస్తున్నారు.    

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)