Breaking News

నేతన్నకు నగదు పరపతి

Published on Fri, 09/29/2023 - 03:18

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తంతోపాటు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం నగదు పరపతి కూడా సమకూరుస్తోంది. మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలు, మార్కెటింగ్‌కు అనేక రూపాల్లో ఊతమిస్తోంది. చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా వరుసగా ఐదు విడతల్లో నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించిన సంగతి తెలిసిందే.

సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేలు  చొప్పున ఐదు విడతల్లో రూ.1.20 లక్షలు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కార్మికులు తమ మగ్గాలను డబుల్‌ జాకార్డ్, జాకార్డ్‌ లిఫ్టింగ్‌ మెషిన్‌ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్‌ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్‌ కోసం రూ.1,396.45 కోట్లు ఇచ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది.

నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు సాయం వంటి మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లను వెచ్చించింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇవి కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు సైతం అందిస్తోంది. 

సహకార బ్యాంకుల ద్వారా రుణాలు 
వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ కోసం ప్రాథమిక చేనేత­కారుల సహకార సంఘా(పీహెచ్‌డబ్ల్యూపీఎస్‌)లకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అంది­స్తోంది. రాష్ట్రంలో 681 చేనేత సొసైటీలకు రూ.209.29 కోట్లు నగదు పరపతి (రుణాలు) అందించింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)