Breaking News

కొండల్లోకి పారిపోయిన ‘గురుకుల’ విద్యార్థులు

Published on Tue, 09/24/2024 - 04:39

నాదెండ్ల: గురుకుల పాఠశాలలో తమను వేధింపులకు గురిచేస్తున్నారని, సరైన ఆహారం అందించకుండా హింసిస్తూ తమతో బాత్రూమ్‌లు కడిగిస్తున్నారని.. అదేమని అడిగితే చావబాదుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల గోడ దూకి సమీపంలోని కొండల్లోకి పారిపోయారు. సోమవారం జరిగిన ఈ సంఘటన పల్నాడు జిల్లాలో సంచలనం రేపింది. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 6–10 తరగతుల్లో 450 మంది విద్యార్థులున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో ప్రార్థన జరుగుతుండగా 67 మంది గోడ దూకి బయటకు వెళ్లారు.

ఇది చూసి కొందరు ఉపాధ్యాయులు 30 మందిని వెనక్కి తేగా.. మరో 37 మంది సమీపంలోని కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బానాయుడు, ఎస్‌ఐ  బాలకృష్ణ సిబ్బందితో కలిసి కొండల్లో విద్యార్థులను వెతికి పట్టుకున్నారు. పాఠశాలలో భోజనం బాగుండదని, తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని, మెనూ ప్రకారం వడ్డించరని తెలిపారు. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాకెట్‌ మనీని ప్రిన్సి పాల్‌కు ఇస్తామని, సెలవుల్లో తాము ఇళ్లకు వెళ్లేట ప్పుడు అడిగినా ఆ డబ్బు ఇవ్వడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.

పాఠశాల ప్రారంభంలో త మకు ఫ్రీ సీట్లు వచ్చినా ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.4 వేలకు పైగా వసూలు చేశారని చె ప్పారు. పోలీసులు నచ్చజెప్పి తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, గురుకుల పాఠశాల జిల్లా కో–ఆరి్డనేటర్‌ పద్మజ, తహసీల్దార్‌ జయశ్రీలు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్‌ హనుమంతరావు, వైస్‌ ప్రిన్సిపల్‌ కంచర్ల శిరీష్‌బాబు, ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. జిల్లా కోఆరి్డనేటర్‌ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాలున్నాయని, దీంతో వారు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, వారి ప్రోద్బలంతోనే గోడదూకి పారిపోయారని తెలిపారు.

Videos

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)