Breaking News

ఐదేళ్లలో పులులు, ఏనుగుల దాడులకు... 3,247 మంది బలి

Published on Mon, 08/11/2025 - 05:40

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పులులు, ఏనుగుల దాడుల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత ఐదేళ్లలో పులులు, ఏనుగుల దాడిలో 3,247 మంది మృత్యువాతపడ్డారు. ఆహారం, తాగు­నీరు కోసం అడవుల నుంచి పంట పొలాలు, మైదాన ప్రాంతాల్లోకి పులులు, ఏనుగులు రావ­డం రోజురోజుకూ పెరుగుతోంది. వాటికి, మానవులకు మధ్య సంఘర్షణలు కూడా ఎక్కువయ్యా­యి. అందువల్ల పులులు, ఏనుగుల దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత ఐదేళ్లలో పులుల దాడుల్లో దేశవ్యాప్తంగా 378 మంది మృతిచెందారని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 218 మంది మృతిచెందినట్లు వివరించింది. గత ఐదేళ్లలో ఏనుగుల దాడుల్లో 2,869 మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. ఇందులో అత్యధికంగా ఒడిశాలో 624 మంది, ఆ తర్వాత జార్ఖండ్‌లో 474 మంది, పశ్చిమ బెంగాల్‌లో 436 మంది మృతిచెందారని వివరించింది. 

వన్యప్రాణులసంరక్షణ చర్యలకు కేంద్రం సాయం 
దేశంలో వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆవాసాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్య­లు తీసుకుంటున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భా­గం­గా ‘వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి’, ‘ప్రా­జెక్ట్‌ టైగర్‌’, ‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. 

అడవి జంతువులు పంట పొలాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ముళ్ల తీగతో కంచె, సోలర్‌ ఫెన్సింగ్, బయోఫెన్సింగ్, సరిహద్దు గోడలు వంటివాటి ఏర్పాటుకు కూడా మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. అడవి జంతువుల దాడుల్లో మృతిచెందిన వారికి లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించిన వారికి ఎక్స్‌గ్రేíÙయాను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్లు వివరించింది.  

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు