Breaking News

‘సాక్షి’ చొరవ.. 31 మంది సురక్షితం

Published on Fri, 07/19/2024 - 05:02

ఏలూరు (మెట్రో): ‘సాక్షి’ చొరవతో వరద నీటిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 31 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉంది. నారాయణపురం, బచ్చువారిగూడెం మధ్య కట్టమైసమ్మ గుడి వద్ద ఉన్న పెద్ద వాగు బ్రిడ్జి మీదుగా కొయిదా ఆసుపత్రికి పలువురు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గురువారమూ పలువురు వైద్య సిబ్బంది, ప్రజలు కొయిదా బయల్దేరారు. వారు పెద్ద వాగు బ్రిడ్జి పైకి చేరుకున్న సమయంలోనే వాగులోకి ఒక్కసారిగా వరద రావడంతో గేట్లు ఎత్తేశారు. దీంతో భారీగా వరద నీరు బ్రిడ్జిమీదుగా ప్రవహించింది. 

మరోపక్క గోదావరి వరద కూడా పెరగడంతో నది బ్యాక్‌ వాటర్‌ కూడా మరోపక్క నుంచి బ్రిడ్జిని చుట్టుముట్టింది. దీంతో కొయిదా ఆస్పత్రి సిబ్బంది సహా 31 మంది బ్రిడ్జిపైన వరద నీటి మధ్యలో చిక్కుకుపోయారు. వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. స్థానికులు ఈ విషయాన్ని ‘సాక్షి’ మీడియాకు తెలిపారు. తక్షణమే స్పందించిన ‘సాక్షి’ సిబ్బంది జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వికి, జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణికి సమాచారం అందించారు. కలెక్టర్‌ వెంటనే స్థానిక ఏపీ, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. 

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, పాల్వంచ ఆర్డీవో, అశ్వారావుపేట తహసీల్దార్‌తోనూ మాట్లాడి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళం, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలోకి దింపారు. బోట్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు  ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులతో మాట్లాడి, నౌకా దళం హెలికాప్టర్‌ను రప్పించారు. నౌకాదళం సిబ్బంది సాయంత్రం నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రమించి అందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)