Breaking News

తన్విత.. లేమ్మా!

Published on Tue, 09/10/2024 - 08:27

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మూడేళ్ల చిన్నారి తన్వితకు మూడురోజులుగా తీవ్ర జ్వరం. కళ్లు తెరవలేని పరిస్థితి. వైద్యం చేయిద్దామన్నా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి తల్లిదండ్రులది. జ్వరంతోనే ఈ చిన్నారి మృత్యువాతపడింది. న్యూ రాజరాజేశ్వరి పేటలోని జీప్లస్‌ త్రీ అపార్ట్‌మెంట్‌ 20వ బ్లాక్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నివసిస్తున్న రొట్టా కృష్ణ, సునీత దంపతులకు ఇద్దరు పిల్లలు. తని్వత(3) పెద్దపాప. కృష్ణ పెయింటింగ్‌ పనులు చేస్తూ, సునీత ఇంటి వద్ద కుట్టుమిషన్‌ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు.

 బుడమేరు వరద కృష్ణ ఇంటిలోకి చేరడంతో సమీపంలో బంధువుల ఇంటిలో తలదాచుకున్నారు. వారం రోజులుగా రాజరాజేశ్వరిపేటను వరద ముంచేసింది. బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించే వీలులేదు. ఈ క్రమంలో తని్వతకు మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లలేని నిస్సహాయస్థితి. ఇంట్లోనే అందుబాటులో ఉన్న మాత్రలు వేశారు. సోమ వారం కొంత వరద తగ్గడంతో తన్వితను పాత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. 

అక్కడ పరీక్షించిన వైద్యులు మార్గ మధ్యంలోనే పాప చనిపోయిందని నిర్ధారించారు. మాయ దారి వరద తమ బిడ్డను మింగేసిందంటూ తన్విత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘తన్వీ.. లేనాన్న.. నన్ను చూడు.. నీకేం కాదు. నేనున్నాను..’ అంటూ    చిన్నారి మృతదేహంపైపడి తల్లి సునీత రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)