Breaking News

నరకయాతన అనుభవించాం

Published on Wed, 09/04/2024 - 05:04

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌) :  భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో హెచ్‌ఆర్‌టీ అపార్ట్‌మెంట్‌. ఐదు అంత­స్తుల సౌధం. మొత్తం 66 ఫ్లాట్స్‌. 27 అడుగుల డబుల్‌ సెల్లారు. శనివారం అపార్ట్‌మెంట్‌ చుట్టుప­క్కల వర్షపు నీరు చేరడంతో అడ్డుగా ఇసుక బస్తాలు వేశారు. ఆదివారం ఉదయానికి అమాంతం బుడ­మేరు వరద సెల్లార్‌లో చేరింది.

 27 అడుగుల సెల్లార్‌ నిండిపోయింది. పార్కింగ్‌లో ఉన్న 42 కార్లు, 72 బైక్‌లు చూస్తుండగానే పూర్తిగా నీటము­నిగిపోయాయి. విద్యుత్‌ సరఫరా లేదు. ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేదు. మెట్ల మార్గం గుండా వచ్చి చూస్తే సెల్లారులో భయంకరమైన వరద. అపార్ట్‌మెంట్‌లో పిల్లలు, వృద్ధులు, దీర్ఘ­కా­లిక వ్యా«­ది­గ్రస్తులు ఉన్నారు. చేసేది లేక అంతా అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లిపోయారు. లిఫ్ట్, మెట్ల గుండా సెల్లార్‌­లోకి రావ­డానికి వీల్లేకుండాపో­యింది. 

అధికారులు ఎవరూ రాలేదు. ఎస్‌డీఆర్‌­ఎఫ్‌ బృందాలకు ఫోన్‌ చేస్తే స్పందించలేదు. రాత్రి కొందరు అందుబాటు­లో ఉన్న వస్తువులతో కమర్షియల్‌ ప్లాట్ల వైపు ఫస్ట్‌ ఫ్లోర్‌  గోడ­ను పగులగొట్టారు. గంటల సమయం పట్టింది. సోమ­వారం ఉదయానికి అపార్ట్‌మెంట్‌లో వాళ్లందరిని పగులగొట్టిన గోడ మార్గం గుండా బయటకు తీసుకెళ్లి లారీలు, ట్రాక్టర్లలో బంధువులు, స్నేహి­తుల ఇళ్లకు పంపించేశారు.

ఇంతటి నరకం ఎప్పుడూ చూడలేదు
నాకు భార్య, ఇద్దరు పిల్లలు­న్నారు. మా అత్త­కూడా మా వద్దే ఉంటోంది. అపా­ర్ట్‌మెంట్‌ సెల్లార్‌­లో కేటాయించిన గదిలో ఉన్నాం. ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. నిమిషాల్లో మా గది మునిగిపోయింది. ఇంట్లో వస్తువులన్నీ వదిలేసి పిల్లలతో మూడో ఫ్లోర్‌లో తల­దాచుకున్నాం. కరెంట్‌ లేదు. ఆహారం లేదు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. ఫ్లాట్స్‌ యజ­మానులంతా వెళ్లిపోయారు. మా కుటు­ంబమంతా బిక్కుబిక్కుమంటూ గడి­పాం. ఇంతటి నరకం ఎప్పుడూ చూళ్లేదు. – గంగాధర్, భవానీపురంలో అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌

గుండెలదిరిపోయాయి
వరద వస్తుందన్న సమాచారం లేదు. సెల్లార్‌­లోకి వస్తున్న వరద చూసి కిందికి వెళ్లే ప్రయత్నం చేశాను. డబుల్‌ సెల్లార్‌ కావడంతో చుట్టుపక్కల వరద అంతా వేగంగా వచ్చి చేరింది. రాత్రంతా పాములు, పందికొక్కులు. రెండు రోజులు దుర్వా­సన. తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు లేవు. ఆహా­రం, పాలు కూడా లేవు. పరిస్థితి చూసి గుండెలదిరిపోయాయి. ఒక్క అధికారి కూడా రాలేదు. – ఆనంద్, భవానీపురంలో అపార్ట్‌మెంట్‌ నివాసి

కృష్ణా నది వరద ఓ వైపు.. బుడ­మేరు వరద మరోవైపు చూసి భయంతో వణికిపోయాం. పై ఫ్లోర్లలో ఉండే వారంతా లిఫ్ట్, మెట్ల నుంచి కిందకు దిగే పరిస్థితి లేక ఇళ్లలో విని­యోగించే వస్తువులతో గంటల కొద్ది కష్టపడి గోడ పగులగొట్టాం. లారీ, ట్రాక్టర్‌ మాట్లాడు­కుని పగు­లగొట్టిన గో­డ మీదుగా గుండె జబ్బులు ఉన్నవారిని బయటకు తీసు­కొచ్చాం. వారందరినీ బం«ధువులు, స్నేహితుల ఇళ్లకు పంపించేశా­ం. ప్రాణాలైతే కాపాడుకోగలిగాం గానీ భారీ ఆస్తినష్టం సంభవించింది.– శివ, ప్రెసిడెంట్, హెచ్‌ఆర్‌టీ అపార్ట్‌మెంట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)