Breaking News

మన్యంలో కాఫీ సిరులు

Published on Tue, 01/28/2025 - 05:03

కొండాకోనా చదునుచేసి, తుప్పా డొండా తగలబెట్టి పోడు కొట్టి నాలుగు గింజలు పండించి కడుపు నింపుకునే గిరిజనులు ఇప్పుడు పంథా మార్చారు. వాణిజ్య పంటల సాగుతో మైదాన ప్రాంత రైతులకు దీటుగా దూసుకుపోతున్నారు. పోడును పక్కన పెట్టి కాఫీ తోటల సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దశాబ్దాల కిందట మన్యంలో ప్రారంభమైన కాఫీ సాగు ప్రస్తుతం ఇంతింతై వేల ఎకరాలకు విస్తరించింది. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏల తోడ్పాటుతో గిరి రైతులు అద్భుతాలే చేస్తున్నారు.  

సాక్షి,పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అడవిని నరికి పోడు వ్యవసాయం చేసుకుని దుర్భర జీవనం సాగించే గిరిజన రైతులు నేడు కాఫీ తోటల సాగుతో ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు.1967లో జి.కే.వీధి మండలం ఆర్‌.వి.నగర్, అనంతగిరి, మారేడుమిల్లి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కేంద్ర కాఫీ బోర్డు మూడు ఎకరాల్లో అరబికా రకం కాఫీ తోటల సాగు ప్రారంభించింది. గిరిజనులకు భాగస్వామ్యం చేస్తూ కేంద్ర కాఫీ బోర్డు చేసిన ఈ ప్రయత్నం వృథా కాలేదు.

గిరిజనులను పోడు వ్యవసాయం నుంచి దూరంగా పెట్టి వారితో కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్‌ ఓక్‌ మొక్కలు నాటించి అవి బాగా ఎదిగిన తరువాత ఆ మొక్కల మధ్య కాఫీ మొక్కలు నాటించారు. దీంతో 1967 నుంచి ఏటా మన్యంలో కాఫీ తోటలు విస్తరిస్తూ వచ్చాయి. కేంద్ర కాఫీబోర్డుతో పాటు పాడేరు ఐటీడీఏ కాఫీ తోటలు విస్తరించేందుకు గిరిజన రైతులకు మొక్కలతో పాటు ఆవి ఎదిగేంతవరకు ఆర్థిక భరోసా కల్పించాయి. కాఫీ రైతులకు ఫల్పింగ్‌ యూనిట్లు, ఇతర యంత్రాలు, ఇంటి ముందు సిమెంట్‌ కళ్లాలు కూడా నిర్మించాయి. 

2,59,947 ఎకరాల్లో కాఫీ సాగు 
పాడేరు డివిజన్‌లోని 11మండలాలతో పాటు రంపచోడవరం డివిజన్‌లోని మారేడుమిల్లి ప్రాంతంతో కలుపుకుని ప్రస్తుతం 2,59,947 ఎకరాల్లో కాఫీతోటలు సాగవుతున్నాయి. 2,45,800మంది గిరిజన రైతులు కాఫీ సాగు ద్వారా ఉపాధి పొందుతున్నారు. 1967లో జి.కే.వీ«ధి మండలం ఆర్‌.వి.నగర్‌లో కేంద్ర కాఫీ బోర్డు కాఫీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో మూడు ఎకరాలతో ప్రారంభమైన కాఫీ సాగు ప్రస్తుతం వేల ఎకరాలకు విస్తరించడం వల్ల గిరిజనులకు ఉపాధి దొరకడంతో పాటు కొండపోడు భూములన్నీ ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.  

ఎకరానికి రూ.50వేల వరకు ఆదాయం 
గిరిజన రైతులు కాఫీతోటలను సేంద్రియ పద్దతిలోనే సాగు చేస్తుండడంతో ఇక్కడి కాఫీ నాణ్యతలో నంబర్‌ వన్‌గా నిలుస్తోంది. ఎకరానికి 500 కిలోల వరకు కాఫీపండ్ల దిగుబడి వస్తుంది. వీటిని పల్పింగ్‌ చేసి 80 నుంచి 160 కిలోల వరకు పాచ్‌మెంట్‌ కాఫీగింజలను గిరిజన రైతులు అమ్ముతారు. అలాగే కాయలను నేరుగా ఆరబెట్టి చెర్రీ రకంగాను అమ్ముతుంటారు.ప్రస్తుతం మొత్తం తోటల్లో 2,01,947 ఎకరాల కాఫీ తోటలు మాత్రమే ఏటా ఫలసాయం ఇస్తున్నాయి. 14 వేల మెట్రిక్‌ టన్నుల పాచ్‌మెంట్‌ కాఫీ గింజలను గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. ఎకరానికి రూ.50 వేల వరకు ఆదాయం వస్తుండటంతో గిరిజన రైతులకు ఏటా కాఫీ పంట జీవనోపాధి కల్పించి ఆదుకుంటోంది. గత మూడేళ్లలో సాగు చేసిన కాఫీతోటలు కూడా వచ్చే ఏడాది నాటికి ఫలసాయం ఇవ్వనున్నాయి. 

ఈ ఏడాది మరింత డిమాండ్‌ 
మన్యంలో గిరిజన రైతులు సాగు చేసే నాణ్యమైన కాఫీ గింజలకు బెంగళూరు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. అక్కడి మార్కెట్‌లో పాచ్‌మెంట్‌ కాఫీ గింజలకు కిలో రూ.450 వరకు ధర పలుకుతుండటంతో ఏజెన్సీలోని జీసీసీ, ఐటీడీఏతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఎన్‌జీవోలు, ప్రైవేట్‌ వ్యాపారులంతా పోటాపోటీగా గిరిజన రైతుల నుంచి కాఫీ పంటను కొనుగోలు చేస్తున్నారు. ఎజెన్సీలో పాచ్‌మెంట్‌ కాఫీ గింజల ధర కిలో రూ.350 పలుకుతోంది. దీంతో ఈఏడాది ఎకరానికి అదనంగా మరో రూ.20 వేలు ఆదాయం వస్తుందని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పోడు వ్యవసాయం మానేసాం 
పూర్వం మోదాపల్లి ప్రాంతంలో అడవిని నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్లం.1975లో కాఫీ మొక్కలను తమ తండ్రులు నాటుకున్నారు.1980 నుంచి కాఫీతోటల ద్వారా ఆదాయం పొందుతున్నాం. మాకు మూడున్నర ఎకరాల కాఫీతోటలు ఉన్నాయి.నా ఇద్దరు కొడుకులకు.నాకు ఈ కాఫీతోటే ఆధారం. ప్రతి ఏడాది రూ.1లక్షా 50వేల వరకు ఆదాయం వస్తుంది. – డిప్పల హసన్న కాఫీ రైతు, మోదాపల్లి, పాడేరు మండలం  

మార్కెటింగ్‌ సేవలు మరింత విస్తరించాలి 
కాఫీతోటల సాగుతో ఏటా గిరిజన రైతులకు మంచి ఆదాయం వస్తున్నప్పటికీ, మార్కెటింగ్‌ సేవలను మరింత విస్తరించాలి. బెంగళూరు మార్కెట్‌లో ఈఏడాది పాచ్‌మెంట్‌ గింజలకు కిలో రూ.450 ధర ఉన్నప్పటికీ జీసీసీ, ఇతర సంస్థలన్నీ కిలో రూ.350 తోనే కొనడం వల్ల మరింత ఆదాయాన్ని కోల్పోతున్నాం. బెంగళూరు కాఫీ మార్కెట్‌ ధరలను పరిగణనలోకి తీసుకుని ఏజెన్సీలో కాఫీ గింజలను కొనుగోలు చేయాలి. – పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమం సంఘం నేత, పాడేరు 

దిగుబడులు పెంచేందుకు చర్యలు 
ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్దతుల ద్వారానే కాఫీ­పంట దిగుబడులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాఫీతోటలు గిరిజనులకు వరమనే చెప్పాలి.కాఫీతోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు కేంద్ర కాఫీబోర్డు అన్ని విధాల ప్రోత్సహిస్తుంది. రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. – సమల రమేష్‌ సీనియర్‌ లైజన్‌ అధికారి, కేంద్ర కాఫీబోర్డు మినుములూరు  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)