Breaking News

సబ్‌ స్టేషన్‌ టెండర్‌లో రింగ్‌ మాస్టర్లు!

Published on Sun, 09/07/2025 - 03:39

సాక్షి, అమరావతి: ఏపీ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏపీ సీఆర్‌డీఏ) పరిధిలో విద్యుత్‌ సదుపాయాల కల్పన ప్రక్రియ పాలకులకు, అధికారులకు కల్పవృక్షంగా మారింది. ఇక్కడ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, లైన్ల ఏర్పాటు పేరుతో టెండర్లు పిలిచి, తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నవారికే పనులు కట్టబెట్టడం, ప్రజాధనాన్ని దోచు­కోవడం నిరాఘాటంగా జరుగుతోంది. తాజాగా ఓ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్‌ మాస్టర్లుగా మారి తమ­కు కావాల్సిన ధరకే టెండర్‌ దక్కించుకున్న వైనం బయటపడింది.

ఇదీ టెండర్‌... 
గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని 400/220 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి లింగాయపాలెం సబ్‌ స్టేషన్‌ వరకు 8 కిలో మీటర్లు భూగర్భ విద్యుత్‌ లైన్లను ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌(ఏపీ ట్రాన్స్‌కో) ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా నరసరావుపేటలోని 220కేవీ ఓల్టేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి లైన్‌ ఇన్‌ లైన్‌ అవుట్‌(ఎల్‌ఐఎల్‌వో)ను తయారు చేసి 1,000 చదరపు మీటర్ల క్రాస్‌ లింక్డ్‌ పాలిథిన్‌ భూగర్భ లైన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

ఇందుకోసం సీఆర్‌డీఏ పరిధిలోని లింగాయపాలెంలో 220/33 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌ స్టేషన్‌(జీఐఎస్‌) నిరి్మంచాలని ప్రణా­ళికలు రూపొందించింది. దానికి రూ.267.36 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనికి టెండర్లు కూడా పిలిచింది. గత నెల 18 వరకు ఆన్‌లైన్‌లో ఓపెన్‌ టెండర్లు స్వీకరించింది. గత నెల 21న ప్రైస్‌ బిడ్‌ తెరవాల్సి ఉండగా, 26న తెరిచి ఓ కార్పొరేట్‌ సంస్థకు టెండర్‌ను అప్పగించింది. 18 నెలల్లో పనులు పూర్తవ్వాలని చెప్పింది. ఇంతవరకూ బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ టెండర్‌ వెనుక అసలు కథ వేరే ఉంది.

ఇలా కొట్టేశారు..
బహిరంగ టెండరు పిలిచినప్పటికీ మూడు సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. కాకినాడ సెజ్‌లో నిర్మిస్తున్న 400కేవీ సబ్‌ స్టేషన్ల పనులను రెండు సంస్థలు జాయింట్‌ వెంచర్‌(జేవీ)గా టెండర్‌ వేస్తే వాళ్లకు అప్పగించారు. కానీ, లింగాయపాలెం సబ్‌ స్టేషన్‌కు మాత్రం కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ విధానాన్ని అనుసరించారు. అయితే, కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో జేవీలుగా టెండర్‌ దక్కించుకున్న సంస్థలే ఇక్కడ విడివిడిగా టెండర్లు దాఖలు చేశాయి. మరో కంపెనీ నామమాత్రంగా టెండర్‌ వేసింది. టెండర్ల పరిశీలనలో ఆ కంపెనీని పక్కనపెట్టేశారు. 

ఇక మిగిలిన రెండు సంస్థల్లో ఒకదానికి టెండర్‌ను కట్టబెట్టారు. ఇటు సీఆర్డీఏలోనూ, అటు కాకినాడ ఎస్‌ఈజెడ్‌లోనే కాకుండా ఇవే కంపెనీలకు గతంలోనూ అనేక కాంట్రాక్టులను కూటమి ప్రభుత్వం అప్పనంగా అందించింది. నిజానికి బహిరంగ టెండర్‌ కావడంతో మరికొన్ని సంస్థలు కూడా దాఖలు చేయడానికి ప్రయత్నించాయి. 

కానీ, ఓ మంత్రి అండతో రింగ్‌ మాస్టర్లుగా మారిన కొందరు కాంట్రాక్టర్లు... ఇతర సంస్థలను టెండర్లలో పాల్గొననివ్వలేదని తెలిసింది. వారికి నేరుగా ఫోన్లు చేసి మరీ బెదిరించడంతో భయపడి టెండర్‌ వేయడానికి ముందుకు రాలేదని ట్రాన్స్‌కో వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్రమంగా జరిగిన ఈ టెండర్‌ ప్రక్రియను రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా టెండర్లు పిలవాలని కొన్ని సంస్థలు ఉన్నతాధికారులను డిమాండ్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది.   

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)