‘అమ్మా’నవీయం!

Published on Mon, 02/03/2025 - 05:20

జంగారెడ్డిగూడెం: బిడ్డ కాలికి ముల్లు గుచ్చుకుంటేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లికి ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది.. ఓ తల్లి తన బిడ్డల పట్ల అత్యంత పా­శ­వికంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి వా­రి­ని చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచికానందం పొందింది. ప్రియుడు రోజూ సెల్‌ ఫోన్‌ చార్జింగ్‌ వైరు­తో చిన్నారుల ఒంటిని ఛిద్రం చేస్తున్నా.. ఆ అమ్మ మనసు కరగలేదు. పైగా ఆ పచ్చి గాయాలపై కారం పోసి.. ఆ బిడ్డల నోట్లో మిరపకాయలు కుక్కింది. బిడ్డలు అల్లాడిపోతుంటే.. ప్రియుడితో కలిసి వికృతానందం పొందింది! పోలీసులతో పాటు ఆ బిడ్డలకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా చిన్నారుల ఒంటి మీది గాయాలు చూసి కన్నీళ్లు పెట్టారంటే.. ఆ చిన్నారులను ఆ తల్లి ఎంత చిత్రవధకు గురిచేసిందో అర్థం చేసుకోవచ్చు.      

తల్లి శాడిజం.. పిల్లలకు చిత్రవధ   
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన గానాల శారద కొంతకాలంగా భర్తతో విడిపోయి తన తొమ్మిదేళ్ల కుమారుడు ఉదయ్‌రాహుల్, ఐదేళ్ల కుమార్తె రేణుకతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు స్థానికుడు, అవివాహితుడు నల్లవెలుగుల పవన్‌కుమార్‌తో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో శారద, పవన్‌కుమార్‌లు జంగారెడ్డిగూడేనికి మకాం మార్చి సహజీవనం చేస్తున్నారు. అక్కడే హోటళ్లలో పనిచేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా..  పవన్‌కుమార్‌ రోజూ మద్యం తాగొచ్చి శారద పిల్లలైన ఉదయ్‌రాహుల్, రేణుకలను సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైర్‌తో తీవ్రంగా కొట్టేవాడు. దీనికి శారద అడ్డు చెప్పక పోగా ప్రియుడికి వంతపాడేది. ఇలా పవన్‌కుమార్, శారదలు చిన్నారులను వైరుతో కొట్టడంతో వారి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అలా అవుతున్న గాయాలపై వారు కారం పోసేవారు. మంటను భరించలేక చిన్నారులు అల్లాడిపోతుంటే.. వారి నోట్లో కారంతో పాటు మిరపకాయలు కుక్కి రాక్షసానందం పొందేవారు. వీరు పెడుతున్న హింసలకు ఉదయ్‌రాహుల్‌కు పళ్లు ఊడిపోగా, రేణుక కంటికి తీవ్ర గాయమైంది.  

నా ప్రియుడిపై దెబ్బ పడితే ఊరుకోను..  
ఎప్పటిలాగానే శనివారం అర్ధరాత్రి చిన్నారులను మళ్లీ చిత్రహింసలకు గురిచేశారు. ప్రియుడితో కలిసి తల్లిపెడుతున్న బాధలను తట్టుకోలేక చిన్నారులు ఇద్దరూ భయంతో బయటకు పరుగులుదీశారు. దీంతో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని.. పవన్‌కుమార్‌కు దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. అయితే తన ప్రియుడిని కొడితే ఊరుకోనంటూ శారద అడ్డుకుంది. దీంతో వారు పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఎస్‌ఐ షేక్‌ జబీర్, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒంటి నిండా గాయాలతో నిండిపోయిన చిన్నారులను చూసి చలించిపోయారు. వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చిన్నారులను డీఎస్పీ రవిచంద్ర, సీఐ కృష్ణబాబు పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బేబీ కమలతో పాటు వైద్యులు, పోలీసులు కూడా చిన్నారుల దుస్థితిని చూసి కంటతడి పెట్టారు. ఈ ఘటనను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)