Breaking News

చంద్రునిపై వీరవల్లి వాసికి 2 ఎకరాల భూమి 

Published on Sun, 09/03/2023 - 05:16

హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ బొడ్డు జగన్నాథరావు చంద్రుడిపై రెండెకరాల భూమి­ని కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌కు ఉద్యోగరీత్యా వెళ్లిన ఆయన 2005­లో ఇంటర్నేషనల్‌ లూనార్‌ ల్యాండ్స్‌ రిజిస్ట్రీ గురించి తెలుసుకున్నారు. చంద్రునిపై భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌క్లెయిమ్‌ డీడ్‌ను ఈ సంస్ధ నిర్వహిస్తోంది.

చంద్రునిపై ప్రయోగాలు, చంద్ర మం­డల ప్రదేశాలపై అన్వేషణ, అభివృద్ధి, పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయంగా క్రౌడ్‌ ఫండింగ్‌ చేపట్టేందుకు లూనార్‌ రిపబ్లిక్‌ సొసైటీ ఏర్పడింది. దీంతో న్యూయార్క్‌లోని లూ­నా­ర్‌ రిపబ్లిక్‌ సొసైటీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి­న బొడ్డు జగన్నాథరావు తన కుమార్తెలు మానస, కార్తీక పేరిట చెరో ఎకరం చొప్పున భూ­మి కొనుగోలు చేశారు. చంద్రునిపై ఏయే అక్షాంశాలు, రేఖాం­శాల మధ్య భూమి కొనుగోలు చేశా­రో సవి­వరంగా లూనార్‌ రిపబ్లిక్‌ సొసైటీ ఇచ్చి­న రిజిస్ట్రేషన్‌క్లెయిమ్‌ డీడ్‌పై స్పష్టంగా పేర్కొ­న్నారు.

ల్యాండ్‌ పార్శిల్‌ నంబర్లు, చంద్రునిపై అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు గుర్తించిన ప్రాంతాల పేర్లను కూ డా ఇందులో ముద్రించారు. దీంతోపా­టు చంద్రు­నిపై ఉపరితలం వీడియో సీడీ, కొను­గోలు చేసి­న ల్యాండ్‌ మ్యాప్‌ను జగన్నాథరావుకు ఇచ్చా­రు. తాజా­గా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌–3 విజయ­వంతం కావటం, పలు అంతర్జాతీయ సంస్ధలు కూ­డా చంద్ర మండలంపైకి మానవుల ప్రయాణా­న్ని సులభతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండ­టం సంతోషకరమని జగన్నాథరావు అంటున్నారు.

#

Tags : 1

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)