Breaking News

ఆగని ర్యాగింగ్‌!

Published on Sun, 08/17/2025 - 05:32

సాక్షి, అమరావతి: దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ నిరోధానికి కఠిన చట్టం అమల్లో ఉన్నప్పటికీ... ర్యాగింగ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వైద్యకళాశాలల్లో గత ఏడాది (2024)లో 165 ర్యాగింగ్‌ కేసులు నమోదైనట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 33 కేసులు నమోదైనట్లు తెలిపింది. 

ఆ తర్వాత బిహార్‌లో 17, అత్యల్పంగా కేరళలో ఒక కేసు నమోదైనట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి.  ర్యాగింగ్‌ నిరోధంపై వైద్య విద్యాసంస్థల డీన్‌లు, ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా క్రమం తప్పకుండా మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.  

ర్యాగింగ్‌ నిరోధక చర్యలు పాటించకపోతే గుర్తింపు రద్దు  
వైద్య విద్యాసంస్థలు ర్యాగింగ్‌ నిరోధక ప్రొటోకాల్‌ను పాటిస్తున్నాయా.. లేదా.. అని నిర్ధారించేందుకు వార్షిక ర్యాగింగ్‌ నిరోధక నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రొటోకాల్‌ పాటించకపోతే జరిమానాలు విధించడంతోపాటు విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు సురక్షిత వాతావరణం ఉండేలా ర్యాగింగ్‌ నివారణ, నిషేధం నిబంధనలు–2021ను అమలు చేస్తున్నట్లు వివరించింది. 

అడ్మిషన్‌ బ్రోచర్లు, బుక్‌లెట్లలో ర్యాగింగ్‌ నిరోధక చర్యల గురించి నిర్దిష్ట సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. కళాశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లతోసహా క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు ర్యాగింగ్‌ నిరోధక పోస్టర్లు, హోర్డింగ్‌లను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు ర్యాగింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులను దాఖలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్‌ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసిందని, ఫిర్యాదులను యాంటీ ర్యాగింగ్‌ సెల్‌ పర్యవేక్షిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)