Breaking News

1,500 కొత్త బస్సులొస్తున్నాయి

Published on Sat, 07/08/2023 - 03:44

సాక్షి, అమరావతి: ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. అందుకోసం కొత్తగా 650 బస్సుల కొనుగోలుకు నిర్ణయించింది. చాలా ఏళ్ల తరువాత ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జీతాల వ్యయం, అందుకోసం అప్పులు, వాటిపై వడ్డీలు, ఇతర  నిర్వహణ వ్యయాలతో ఆర్టీసీ దశాబ్దాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ వస్తోంది.

అప్పుల భారం పెరిగిపోవడంతో తొమ్మిదేళ్లుగా కొత్త బస్సులు కొనుగోలు చేయలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఏటా రూ.350 కోట్ల జీతాల భారం లేకుండాపోయింది. ఈ మూడేళ్లలోనే దాదాపు రూ.2 వేలకోట్ల అప్పులను తీర్చగలిగింది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుండటంతో ఆర్టీసీ రాబడి కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సిద్ధమైంది.  

అక్టోబర్‌ నుంచి ప్రతి నెల 200 బస్సులు  
మొత్తం ఏడు కేటగిరీల కింద రూ.650 కోట్లతో బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. సర్విసుల వారీగా అమరావతి–11, వెన్నెల–8, ఇంద్ర–32, స్టార్‌లైనర్‌–27, సూపర్‌లగ్జరీ–­735, అ్రల్టాడీలక్స్‌–145, ఎక్స్‌ప్రెస్‌–542 బస్సు­లు కొనుగోలు చేయనుంది. అమరావతి సర్విసు కింద 11 బస్సులను నేరుగా ఓల్వో కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మిగిలిన 1,489 బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది.

బీఎస్‌–6 మోడల్‌తో అత్యాధునిక ప్రమాణాలతో బస్సులను సరఫరా చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. బిడ్లను ఈ నెల 20న తెరిచి, అనంతరం నెలరోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనుంది. అక్టోబర్‌ నుంచి ప్రతి నెల 200 కొత్త బస్సుల చొప్పున ప్రవేశపెట్టనుంది. 2024 ఏప్రిల్‌ నాటికి మొత్తం 1,500 బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తేనుంది. మరో 600 బస్సులను ఆధునికీకరించి పల్లెవెలుగు సర్విసులుగా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ప్రస్తుతం పల్లెవెలు­గు బస్సులు అప్పుడప్పుడు బ్రేక్‌డౌన్‌ అవుతుం­డటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ సర్విసులుగా ఉంటూ తక్కువ మైలేజీ ఇస్తున్న 600 బస్సు­ల బాడీలను రీఫర్బిíÙంగ్‌ ద్వారా ఆధునికీకరించి పల్లెవెలుగు సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త బస్సుల కొనుగోలుతో ప్రయా­ణికులకు మరింత మెరుగైన సేవలు అందుతా­య­ని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)