సముద్రంలో 150 కి.మీ ఈత

Published on Sat, 01/04/2025 - 05:37

కాకినాడ రూరల్‌ : సముద్రంలో 150 కిలోమీటర్లు ఈది ఆసియాలోనే అరుదైన ఘనతను సాధించారు స్విమ్మర్‌ శ్యామల గోలి. గత నెల 28న విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌ వద్ద సముద్రంలో ఈత ప్రారంభించిన ఆమె ఏడో రోజైన శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కాకినాడ బీచ్‌కు చేరుకున్న శ్యామలకు కాకినాడ నగర కమిషనర్‌ భావన, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు స్వాగతం పలికారు. 

ఐదు పదుల వయసులో అలవోకగా సముద్రాలు ఈదుతూ సాహస యాత్రతో అబ్బుర పరుస్తున్న శ్యామలను చూసేందుకు, ఆమెకు స్వాగతం పలికేందుకు విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పట్నుంచీ స్విమ్మ­ర్‌ను కాదని చెప్పారు. జీరో లెవెల్‌ నుంచి 150 కిలోమీటర్ల మేర స్విమ్‌ చేసేలా తనను కోచ్‌ జాన్‌ సిద్ధిక్‌ తీర్చిదిద్దారన్నారు. 

2021లో శ్రీలంక – ఇండియా మధ్య రామ్‌సేతును ఈదానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్‌ చేశానని గుర్తు చేశారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు సముద్రంలో దిగి.. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒడ్డుకు వచ్చానని.. ఈ లెక్కన ఆరు రోజుల్లోనే లక్ష్యం చేరానన్నారు. స్విమ్మింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, మహిళల్లో గైనిక్‌ సమస్యలు తగ్గుతాయని చెప్పారు.  

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)