Breaking News

నల్లమలలో 11వ శతాబ్దం నాటి శిలాశాసనాలు

Published on Thu, 09/05/2024 - 11:13

ఆత్మకూరు రూరల్‌: గతం తెలియని వారికి భవిష్యత్తు ఉండదని పెద్దలు చెబుతుంటారు. అందుకే గతకాలంలో జరిగిన విషయాలను పరిశోధించి, ఫలితాలను గుదిగుచ్చి చరిత్రగా మన ముందు ఉంచుతుంటారు చరిత్రకారులు. అలాంటి వారి దృష్టికి రాకుండా కొన్ని గతకాలపు ఆనవాళ్లు మరుగున పడిపోతుంటాయి. 

అలాంటివి కృష్ణా తీరంలో, నల్లమల అడవుల్లో ఎన్నో గుప్తంగా ఉండిపోతున్నాయి. ఇక్కడ కనపడుతున్న రెండు శిలాశాసనాలు కూడా అలాంటివే.. ఇవి నాగార్జునసాగర్‌ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని ఇందిరేశ్వరం బీట్‌లో పెద్ద గుమ్మితం వద్ద ఉన్నాయి. గుమ్మితం ఒక ప్రాచీన శైవ క్షేత్రం. కొండపైనుంచి దుమికే జలపాతాన్ని ఏర్పరచిన ఒక కొండ వాగు  ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. 

ఈ క్షేత్ర ఆవరణలో పురాతన లిపి ఉన్న రెండు శిలా శాసనాలు ఉన్నాయి. బాగా పాతకాలంనాడు అప్పటి వారు ఉపయోగించిన తెలుగు లిపితో ఈ శాసనాలు ఉన్నాయి. ఇవి కాకతీయ – విజయనగర పాలన మధ్య కాలంలోనివి(క్రీశ11–12 శతాబ్ధాలు) అయి ఉండొచ్చునని చరిత్రపై అవగాహన ఉన్న కొందరు చెబుతున్నారు. ఇవి ఎర్రయ్య అనే వ్యక్తి వేయించిన దాన శాసనాలుగా తెలుస్తోంది. మల్లికార్జున స్వామికి ఏదో బహుమానం రూపంలో సమర్పించినట్లు లిపిని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తోంది. అయితే ఈ శిలాశాసనాలను పూర్తిస్థాయిలో పరిశోధిస్తే చరిత్రలో మరుగున పడ్డ విషయాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)