Breaking News

మార్చి 16 లేదా 21 నుంచి పది పరీక్షలు

Published on Tue, 11/18/2025 - 04:16

సాక్షి, అమరావతి: పదోతరగతి పరీక్షలను మా­ర్చిలో నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మార్చి 16తో ఒక టైంటేబుల్, మార్చి 21తో మరో టైంటేబుల్‌ రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ రెండింటిలో ఒకదానికి ప్రభుత్వం ఓకే చెప్ప­నుంది. ఈలోగా పరీక్షల సిబ్బంది నియామకం, ఇన్విజిలే­టర్ల ఎంపిక, పరీక్ష సెంటర్ల గుర్తింపుపై దృష్టిసారించారు. దాదాపు 6.50 లక్షల­మంది విద్యార్థులు 3,500 సెంటర్లలో పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 35 వేల­మంది ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది అవసరం. పరీక్షల సరళి పరిశీలన కోసం మరో రెండువేల మంది స్క్వాడ్‌ సిబ్బందిని నియమించాలి. గతేడాది ఇన్విజిలేటర్ల ఎంపికను జిల్లాల్లో చేపట్టగా, ఈసారి రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ నుంచే చేపట్టాలని నిర్ణయించారు. 

చార్జి మెమోలు, సస్పెన్షన్‌ ఉంటే నో చాన్స్‌
ఇన్విజిలేటర్ల ఎంపిక కోసం రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇన్విజి­లేట­ర్లుగా స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీ­లను తీసుకోను­న్నారు. యూడైస్‌లో డేటా ఆధారంగా ఉపాధ్యా­యుల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని డైరెక్టరేట్‌ అధికారులు జిల్లా అధికారు­లను ఆదేశించారు. గతంలో చార్జి మెమోలు తీసు­కు­న్నవారు, సస్పెన్షన్‌కు గురైనవారు, దీర్ఘకాలిక ఆరో­గ్య సమస్యలున్నవారిని పరీక్ష విధులకు దూ­రం పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.

స్కూల్‌ అసిస్టెంట్లను నియమిస్తున్నందున ఆ సబ్జెక్టు పరీక్షల సమయంలో సంబంధిత సబ్జెక్టు టీచర్లను పరీక్ష విధుల నుంచి తప్పించనున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష పేపర్లు వాట్సాప్‌లో ప్రత్యక్ష­మవడంతో బాధ్యులపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలోగా పరీక్షల షెడ్యూల్‌పై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)