Breaking News

గర్భిణిని మోస్తూ తరలించిన 108 సిబ్బంది

Published on Mon, 09/22/2025 - 05:07

కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబు­లెన్స్‌ సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం వరకు ఆమెను మోసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెలగలపాలెం పంచాయతీ శీకా­యాకపాలెంలో పీవీటీజీల వీధికి చెందిన కొర్రా లీలావతికి ఆదివారం పురిటినొప్పులు వచ్చాయి. 

వెంటనే కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. రోడ్డు వసతి లేకపోవడంతో 108 వాహనం గ్రామం వరకు రాలేకపోయింది. దీంతో ఈఎంటీ అశోక్‌కుమార్, పైలట్‌ నవాజ్‌ ఆమెను స్పైన్‌కార్డుపై మోసుకుని ఆ వాహనం వద్దకు తీసు­కొచ్చారు. అక్కడినుంచి 11 కిలోమీటర్ల దూరంలోని అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు.

ఫోన్‌ చేసినా రాని అంబులెన్స్‌.. పసికందు మృతి
» నిండు గర్భిణిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లిన బంధువులు
»  వైద్యం అందక ఆటోలోనే మృతి చెందిన శిశువు 
»  పాడేరు ఐటీడీఏ సమీపంలో విషాదం 
పాడేరు: ఫోన్‌చేసి రెండు గంటలైనా 108 అంబులెన్స్‌ రాలేదు. చివరకు నిండు గర్భిణిని ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రసవించింది. వైద్యం చేసే దిక్కులేక కొద్దిసేపటికే శిశువు దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు శివారు ముల్లుమెట్ట వీధికి చెందిన గెమ్మెలి శాంతి నిండు గర్భిణి. శనివారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. 

రెండు గంటలైనా 108 వాహనం రాకపోవడంతో ముల్లుమెట్ట నుంచి సిల్వర్‌ నగర్‌ వరకు సుమారు అర కిలోమీటర్‌ డోలి కట్టి తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె ఆటోలోనే ప్రసవించింది. కొద్దిసేపటికే శిశువు మృతి చెందింది. అదే ఆటోలో మృతశిశువుతో పాటు తల్లిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పురిటి నొప్పులు వచ్చిన వెంటనే ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలకు విషయం చెప్పామన్నారు. 

కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఈ సమయంలో తాము అక్కడకు రాలేమని చెప్పి ఫోన్‌ పెట్టేశారన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణి శాంతికి ఏనాడు కూడా పౌష్టికాహారం అందించలేదని ఆరోపించారు. 108 రాకపోవడంతో పాటు వైద్య సిబ్బంది స్పందించకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)