Breaking News

ఉద్యోగుల డెడ్‌లైన్‌.. దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

Published on Mon, 11/25/2024 - 15:00

సాక్షి,విజయవాడ: 108 సిబ్బంది నేటి అర్థరాత్రి నుంచి తలపెట్టన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. 108 సమ్మె ప్రకటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. 108 ఉద్యోగుల డిమాండ్ల గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు చర్చలకు రావాలంటూ యూనియన్ నాయకులను ఆహ్వానించింది. ప్రభుత్వం పిలుపు మేరకు నేటి అర్థరాత్రి నుండి తలపెట్టనున్న సమ్మెను యూనియన్‌ నాయకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం నిర్ణయం ప్రకటిస్తామాని  108 ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు. 

మరోవైపు 108 ఉద్యోగులు మెరుపు సమ్మె చేసేందుకు సిద్దమయ్యారు. తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని  ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పెండింగ్‌లో ఉన్న జీతాలు, ఉద్యోగు భద్రతతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో 108 సిబ్బంది రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది మాట్లాడుతూ.. ‘మా డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందించాం. సాయంత్రం వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతాం’ అని స్పష్టం చేశారు.  

ఈ తరుణంలో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం 108 యూనియన్‌ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. దీంతో నేటి అర్థరాత్రి నుంచి జరగాల్సిన సమ్మె వాయిదా పడింది. 

విజయవాడలో 108 సిబ్బంది ఆందోళన

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)