Breaking News

రూ.కోటి కంపెనీకి రెడ్‌ కార్పెట్‌!

Published on Sun, 07/12/2026 - 05:16

సాక్షి, అమరావతి : రెండు నెలల క్రితం కోటి రూపాయలతో పెట్టిన కంపెనీకి 106 ఎకరాలు కేటాయించడమే కాకుండా ఏకంగా రూ.461 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ఉత్తర్వుల మీద ఉత్తర్వులు ఇచ్చేస్తోంది. ఇందుకు ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం వేదిక కావడం గమనార్హం. రూ.1,137.58 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉపాధి కల్పించేలా వుడ్‌ ప్యానల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఎవర్నో ప్యానల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 25న బెంగళూరు కేంద్రంగా కోటి రూపాయల చెల్లింపు ధనంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సాగిల పడుతోంది. వుడ్‌ ప్యానల్స్‌ తయారీలో ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం లేదు. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా తెలుగు రాష్ట్రానికి చెందిన బడతల శ్రీనివాసరావు, కర్ణాటకకు చెందిన అమీత్‌ గంజన్‌ హెగ్డే, మరో వ్యక్తి కనహైలాల్‌ చున్నీలాల్‌ చందక్‌లు ఉన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన బడతల శ్రీనివాసరావు.. అమీత్‌ గంజన్‌ హెగ్డేతో కలిసి గతేడాది జూన్‌ 17న బెంగళూరు కేంద్రంగా లక్ష రూపాయలతో ఇండిప్యానల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో పొగాకు ఉత్పత్తుల సంస్థను ఏర్పాటు చేశారు. 

ఇప్పుడు కేవలం కోటి రూపాయల మూల ధనంతో ఎవర్నో ప్యానల్స్‌ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి కుప్పంలో విలువైన భూములతో పాటు వందల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతుండటం చర్చ నీయాంశమైంది. ఈ క్రమంలో అన్ని అనుమతులు, రాయితీలు సత్వరమే అందేలా పర్యవేక్షణకు ఒక సీనియర్‌ అధికారిని నియమించాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం విస్తుగొలుపుతోంది. 

ఎస్‌ఐపీబీ ముందుకు రెండు నెలల్లో రెండుసార్లు
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటు చేసిన ఎవర్నో ప్యానల్స్‌ కంపెనీ ప్రతిపాదనను జూన్‌ 18న జరిగిన ఎస్‌ఐపీబీ (స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌) సమావేశంలో ఆమోదించడమే కాకుండా కుప్పం శాంతిపురం మండలం గుడుపల్లె వద్ద 106 ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ వెంటనే అదే నెల 28న భూమిని కేటాయిస్తూ జీవో ఎంఎస్‌ నంబర్‌ 155 జారీ చేసింది. దీంతోపాటు విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ వెంటనే జూలై 7వ తేదీన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.461 కోట్ల విలువైన టైలర్‌ మేడ్‌ రాయితీలకు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం, మూడు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిపోయింది.

మొత్తం పెట్టుబడిలో 45.70 శాతం రాయితీల రూపంలో తిరిగి వెనక్కు ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే తీరులో దుబాయ్‌కి చెందిన ఎస్‌ఏఎఫ్‌ వన్‌ ఇండియా కంపెనీకి గత నెలలో ఏపీ మారిటైమ్‌ బోర్డుకు చెందిన 45 ఎకరాల భూమిని కేటాయించగా, ఇప్పుడు అదే కంపెనీకి రూ.617.23 కోట్ల రాయితీలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సిటీలో మాండలీజ్‌ (క్యాడబరీ చాక్లెట్స్‌) సంస్థ రూ.1,801 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులకు రూ.565.88 కోట్ల రాయితీలను ఇస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)