Breaking News

10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్‌ సీట్లు

Published on Sat, 08/19/2023 - 02:46

సాక్షి, అమరావతి: ఇకపై 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్‌ సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వెల్లడించింది.

ఈ మేరకు 2024–25 విద్యా సంవత్సరం నుంచి కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు, ఎంబీబీఎస్‌ సీట్ల పెంపునకు సంబంధించి కనీస ప్రామాణిక అవసరాలు (మినిమమ్‌ స్టాండర్డ్స్‌ రిక్వైర్మెంట్స్‌)–2023 మార్గదర్శకాలను ఎన్‌ఎంసీ శుక్రవారం విడుదల చేసింది. అదే విధంగా.. 2024–25 విద్యా సంవత్సరానికి నూతన కళాశాలల ఏర్పాటు, మెడికల్‌ సీట్ల పెంపునకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం..

♦ ఇకపై కొత్త వైద్య కళాశాలల్లో 50, 100, 150 సీట్ల వరకే అనుమతిస్తారు.  
♦ ఎంబీబీఎస్‌ విద్యార్థులు, కళాశాలల్లో పనిచేసే బోధనా సిబ్బందికి ఆధార్‌ ఆధారిత అటెండెన్స్‌ విధానాన్ని అమలుచేస్తారు. ప్రతి ఒక్కరికీ ఏడాదికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి.  
♦ కళాశాల, బోధనాసుపత్రులకు వేర్వేరు భవ­నాలు ఉన్నట్లయితే వాటి మధ్య దూరా­న్ని గరిష్టంగా 30 నిమిషాల్లో చేరేలా ఉండాలి. 
♦ బోధనాస్పత్రిలో కనీసం 220 పడకలుండాలి.  
♦  కళాశాలల్లో కచ్చితంగా 21 విభాగాలు ఉండాల్సిందే. 
♦  కొత్తగా ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ రీసెర్చ్‌ను..  సిబ్బంది పిల్లల కోసం చైల్డ్‌కేర్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలి.
♦ మూడు మ్యూజియంలు ఉండాలి. అందు­లో ఒకటి అనాటమీ, రెండు.. పాథా­ల­జీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌.. మూడోది ఫార్మకా­లజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిí­Ü­న్‌­కు కేటాయించాలి. వీటితో పాటు లైబ్రరీ, స్కిల్‌ ల్యాబొరేటరీ సదుపాయాలుండాలి.  
♦  కళాశాలకు అనుబంధంగా గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రాలు/కమ్యూనిటీ హెల్త్‌/అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉండాలి. 
♦ ఒక్కో కేంద్రంలో 15 మంది చొప్పున విద్యార్థులను ఇంటరŠన్స్‌గా పోస్ట్‌ చేయాలి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)