Breaking News

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల

Published on Fri, 07/14/2023 - 14:42

అమరావతి: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 111 గ్రూపు-1 పోస్టులకు గాను 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్ కోటా నుండి ఎంపికయ్యారు. 

గ్రూప్-1 పరీక్ష జరిగిన కేవలం 34 రోజులలోనే ఫలితాలు విడుదల చేసింది ఏపీపీఎస్సీ .  జూన్ 3 నుండి 10వ తారీఖు వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు మొత్తం 5035 మంది హాజరు కాగా వారిలో నుండి 259 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరుగుతాయి. 

ఏపీపీఎస్సీ  ప్రతిష్టాత్మంకంగా నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలు ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ  నిర్వహించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ పర్యవేక్షణలో మూల్యాంకనం స్క్రూటినీ కార్యక్రమాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరిగింది.      

ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలను నిర్వహించి సెప్టెంబర్‌ నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది కమిషన్‌. ముందుగా నిర్ణయించినట్టుగానే క్యాలెండర్ ప్రకారం సకాలంలోనే నియామకాలు జరుగుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)