అవార్డుల.. హరిత

Published on Thu, 10/05/2023 - 02:10

కడెం: కడెం ప్రాజెక్ట్‌ తీరాన.. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైనా విడిది గదులతో పర్యాటకుల మనసు దోచుతుంది కడెం హరిత రిసార్ట్స్‌. పర్యాటకులకు చక్కని అతిథ్యాన్ని అందిస్తూ.. అవార్డులను సొంతం చేసుకుంటుంది.

ఇటీవలే హైదరాబాద్‌ శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌, ఎండి మనోహర్‌రావు చేతుల మీదుగా రిసార్ట్స్‌ మేనేజర్‌ నునవత్‌ తిరుపతి ఉత్తమ రిసార్ట్స్‌ అవార్డ్‌ను అందుకున్నారు.

ఆహ్లాదకరంగా హరిత రిసార్ట్‌...
కడెం ప్రాజెక్ట్‌ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ప్రాజెక్ట్‌ తీరాన 2015లో పర్యాటకశాఖ 12 విడిది గదులు, రెస్టారెంట్‌, మీటింగ్‌హాల్‌తో హరిత ఏకో టూరిజం రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల కాలంలో పర్యాటకుల ఉత్తమ సేవలందిస్తూ మూడు సార్లు బెస్ట్‌ రిసార్ట్స్‌ అవార్డ్‌ను అందుకుంది. ప్రముఖులతో పాటు, వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి విడిది చేస్తుంటారు.

సెలవు దినాల్లో, వీకెండ్‌లో పర్యాటకులతో సందడిగా ఉంటుంది. పర్యాటకులు సేదతీరేందుకు విడది గదులతో పాటుగా, పిల్లలకు చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా ఉంటుంది. పర్యాటకులతో పాటుగా ప్రీ వెడ్డింగ్‌, బర్త్‌డే షూట్‌లతో పాటుగా, ఫిల్మ్‌ షూట్‌లకు హరిత రిసార్ట్‌ ఫేమస్‌. అయితే ఇందులో తొమ్మిది మంది విధులు నిర్వహిస్తుండగా ఏడాదికి సుమారుగా రూ.4 నుంచి 5 లక్షల ఆదాయం సమకూరుతుంది.

గదుల బుకింగ్‌
పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ ద్వారా గదులను బుక్‌ చేసుకోవచ్చు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.టీఎస్‌టీడీసీ.కామ్‌ ద్వారా గదులను బుక్‌ చేసుకోవచ్చు. వీకెండ్‌లో (శుక్ర, శని, ఆదివారల్లో) 1848, మిగాత రోజు ల్లో 1680(జీఎస్టీతో కలిపి). మరిన్ని వివరాలకు 9133053007 నంబర్‌లో సంప్రదించవచ్చు.

సిబ్బంది సహకారంతో
రాష్ట్రంలోనే బెస్ట్‌ రిసార్ట్‌గా కడెం హరితకు అవార్డ్‌ దక్కడం వెనుక సిబ్బంది సహకారం ఎంతో ఉంది. మూడుసార్లు హరిత రిసార్ట్స్‌కు అవార్డ్‌ దక్కడం అనందంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. శుభాకార్యలు, వింధులు జరుపుకునేందుకు అవకాశం ఉంది. పర్యాటకుల టూరిజం శాఖ తరఫున సౌకర్యాలు అందిస్తున్నాం.  – నునవత్‌ తిరుపతి, హరిత రిసార్ట్స్‌ మేనేజర్‌, కడెం

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)