Breaking News

ఉత్తమ పరిశోధనలకు ఉన్నత పురస్కారాలు

Published on Tue, 10/08/2024 - 04:59

సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఉత్తమ పరిశో­ధనలను ప్రోత్సహించి, నాణ్యతను పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఉన్నత స్థాయి అవార్డులను ప్రవేశ­పెడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పీహెచ్‌డీ పరిశోధనలు అందించిన వారిని ‘పీహెచ్‌డీ ఎక్సలెన్స్‌ సైటేషన్‌’తో సత్కరించనుంది. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాల్లో భాగంగా ఏటా వివిధ విభాగాల్లో అత్యుత్తమ­మైన పది పీహెచ్‌డీ థీసిస్‌లకు ఈ అవార్డు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రాల దగ్గర నుంచి వైద్య శాస్త్రాలతో సహా ఐదు విభాగాల్లో రెండు చొప్పున ఉత్తమ థీసిస్‌లకు సైటేషన్‌ అవార్డులు ప్రదానం చేస్తారు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం యూజీసీ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఏటా సెప్టెంబర్‌ 5న ప్రదానం
ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు కాన్వకేషన్‌ ద్వారా పీహెచ్‌డీలు పొందిన రీసెర్చ్‌ స్కాలర్లు తదుపరి ఏడాదిలో ‘సైటేషన్‌’ అవార్డుకు అర్హులుగా పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీల నుంచి పీహెచ్‌డీలు పొందిన వారు వర్సిటీల ద్వారా నామినేట్‌ అవ్వొచ్చు. ఇందుకోసం ప్రతి విశ్వవిద్యాలయంలో స్క్రీనింగ్‌ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ విశ్వవిద్యా­లయం నుంచి ఏటా ఐదు థీసిస్‌లను నామినేట్‌ చేస్తుంది. ఏటా జనవరి నుంచి మార్చి 31 వరకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా వర్సిటీల నుంచి నామినేషన్లు యూజీసీ స్వీకరిస్తుంది. ఆగస్టు 1న విజేతలను ప్రకటిస్తారు. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ‘పీహెచ్‌డీ ఎక్సలెన్స్‌ సైటేషన్‌’తో విజేతలను యూజీసీ సత్కరిస్తుంది.

యూజీసీ అధ్యయనం ప్రకారం దేశంలో పీహెచ్‌డీలో ప్రవేశాలు భారీగా పెరుగుతున్నాయి. 2010–11లో దేశవ్యాప్తంగా 77,798 పీహెచ్‌డీ ప్రవేశాలు నమోదవగా, 2017–18లో ఈ సంఖ్య 1,61,412కు పెరిగింది. ఏటా సగటున 10 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది.

కొత్త ఆవిష్కరణలు అవసరం
కొత్త ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి చాలా అవసరం. ఉన్నత విద్యా సంస్థలు కొత్త విజ్ఞానాన్ని సమాజానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది డాక్టోరల్‌ డిగ్రీల నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. భారతీయ విశ్వవిద్యా­లయాలలో మంచి నాణ్య­మైన పరిశోధనలను ప్రోత్స­హించే ప్రయత్నంలో యూ­జీసీ ఏటా ‘పీహెచ్‌డీ ఎక్సలెన్స్‌ సైటేషన్‌’ను ప్రదానం చేయాలని నిర్ణ­యించింది. ప్రజాభిప్రాయం కోసం మార్గదర్శకాలను విడుదల చేశాం.  – మామిడాల జగదీశ్‌ కుమార్, యూజీసీ చైర్మన్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)