Breaking News

శ్రీనగర్‌: రెండు దశాబ్ధాల ఓటింగ్‌ రికార్డు బద్దలు!

Published on Tue, 05/14/2024 - 07:50

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 38 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం. నాడు జమ్మూకశ్మీర్‌లోని ఈ స్థానంలో దాదాపు 41 శాతం ఓటింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు శ్రీనగర్ నియోజకవర్గంలో జరిగాయి.

సోమవారం రాత్రి 11 గంటల వరకు శ్రీనగర్‌లో 38 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారిని ప్రశంసించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వలన జమ్మూ కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి యువతకు ప్రయోజనం చేకూరుతున్నదన్నారు.

ఓటింగ్‌లో పాల్గొన్న శ్రీనగర్ నియోజకవర్గ ప్రజలకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలు రాజకీయ పార్టీలు అభినందనలు తెలిపాయి. శ్రీనగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్, గండేర్బల్, పుల్వామా జిల్లాలు, బుద్గామ్, షోపియాన్ జిల్లాల్లోని 2,135 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఓటింగ్ జరిగింది.

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గత 34 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 1996లో పోలింగ్ నమోదైంది. నాడు దాదాపు 41 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 14.43 శాతం ఓట్లు పోలయ్యాయని, అంతకుముందు పార్లమెంటు ఎన్నికల్లో అంటే 2014లో 25.86 శాతం 2009లో 25.55 శాతం, 2004లో 18.57 శాతం, 1999లో 11.93 శాతం, 1986లో 30.086 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది.
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)