ఇరు వర్గాల మధ్య ఘర్షణ: ఇద్దరు పోలీసులు మృతి

Published on Thu, 01/02/2014 - 09:50

బీహార్ వైశాలీ జిల్లాలోని జుదవన్పూర్ పరిధిలోని పోలీసు స్టేషన్లో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో ఇరువర్గాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. మృతుల్లో స్టేషన్ ఎస్ఐతోపాటు కానిస్టేబుల్ కూడా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అందుకోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. పోలీసులు కథనం ప్రకారం ... ఇటీవల ఆ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో ఇరువర్గాల మధ్య భూవివాదం చోటు చేసుకుంది.

 

ఆ భూవివాదంపై తరచుగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో బుధవారం జరిగిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ తీవ్రమైంది. దాంతో ఓ వర్గం మరో వర్గంపై కాల్పులు జరిపింది. దీంతో రెండో వర్గం కూడా కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఊహించని ఆ పరిణామానికి ఇరువర్గాలు భయభ్రాంతులయి, కాళ్లకు బుద్ధి చెప్పి చెరో దిక్కుకు పరుగులు తీశారు.  స్థానిక పోలీసు స్టేషన్లోని పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)