amp pages | Sakshi

మట్టి పరీక్షలతోనే సరి!

Published on Thu, 07/10/2014 - 23:56

తాండూరు:  కాగ్నా నది (వాగు)లో చెక్‌డ్యాం నిర్మాణానికి పునాదిరాయి కూడా పడలేదు. చెక్‌డ్యాం గురించి ప్రజాప్రతినిధులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచి కాగ్నా వరద జలాలను వినియోగంలోకి తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు శ్రద్ధ కనబరచడం లేదనే విషయం స్పష్టమవుతోంది. చెక్‌డ్యాం నిర్మాణానికి 2013 మార్చిలో సుమారు  రూ.8.52 కోట్ల నిధులు (అడ్మిస్ట్రేషన్ సాంక్షన్) మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ చెక్‌డ్యాం నిర్మాణంతో సుమారు 35 టీఎంసీల జలాలు అందుబాటులోకి వస్తాయి.

 దాంతో  కాగ్నా వరద జలాలు వినియోగంలోకి వచ్చి తద్వారా మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్‌లోని సుమారు 39 గ్రామాలతో, తాండూరు పట్టణ వాసులకు తాగునీటి కష్టాలు తీరుతాయి. కాగ్నాకు చుట్టుపక్కల సుమారు 750 ఎకరాల ఆయకట్టుకూ సాగునీరు అందుతుంది.  ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోకపోవడంతోనే  చెక్‌డ్యాం పనులు మొదలవడానికి ఆలస్యమవుతోంది.

 గత ఏడాది చివరిలోనే  చెక్‌డ్యాం నిర్మించనున్న ప్రాంతంలో ‘సాయిల్ బేరింగ్ కెపాసిటీ’ (ఎస్‌బీసీ)లో భాగంగా  మట్టి పరీక్షలు నిర్వహించారు. చెక్‌డ్యాం నిర్మాణానికి కాగ్నా సమీపంలోని యాలాల మండల పరిధిలో ఒకటిరెండు గ్రామాల్లో దాదాపు 5ఎకరాల 2గుంటల భూమిని సేకరించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ నిర్మాణ పనులకు  మోక్షం కలగడం లేదు.

 నిధుల సాంకేతిక మంజూరు  కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. చెక్‌డ్యాం నిర్మాణం ప్లాన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉండటం కూడా ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చెక్‌డ్యాం నిర్మాణానికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి పనులు మొదలయ్యేలా ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

Videos

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

బెంగళూరు రేవ్ పార్టీ..బయటపడ్డ సంచలన నిజాలు..

బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

Photos

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)