దిగుడుబావిలో మొసలి : బంధించిన గ్రామస్తులు

Published on Thu, 06/18/2015 - 18:29

పాన్‌గల్ (మహబూబ్‌నగర్) : చెరువులో మొసలి ఉందని ఆ గ్రామస్తులకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉంది. కానీ చెరువు ఎండినా అది మాత్రం కనిపించలేదు. అయితే పక్కనే ఉన్న బావిలో అనుకోకుండా మొసలి జాడ కనిపించటంతో నీటినంతా తోడి దానిని పట్టి బంధించి అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండలం బొల్లారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బొల్లారం గ్రామ సర్పంచి సత్యనారాయణరెడ్డి, వీఆర్‌వో శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని పెద్ద చెరువులో ఏడాది నుంచి మొసలి ఉంటోందనే విషయం గ్రామస్తులకు తెలిసింది. కాగా మిషన్ కాకతీయ పథకం కింద చెరువు పూడిక తీస్తుండటంతో అందులో ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడేశారు. అయితే ప్రమాదం పసిగట్టిన మొసలి అదను చూసుకుని సమీపంలోనే ఉన్న దిగుడు బావిలోకి జారుకుంది. కానీ ఆ విషయాన్ని గ్రామస్తులు గుర్తించలేదు.

గురువారం సాయంత్రం బావిలోకి దిగిన గొర్రెలు నీళ్లు తాగుతుండగా అందులో ఉన్న మొసలి ఒక గొర్రెను పట్టేసింది. దీంతో అక్కడ మొసలి ఉన్న విషయం గ్రామస్తులకు తెలిసిపోయింది. వెంటనే అంతా కలిసి మోటార్ల సాయంతో బావిలో నీటిని తోడేశారు. ఎటూ దారిలేక అందులోనే ఉండిపోయిన మొసలిని తాడుతో గట్టిగా కట్టేసి పంచాయతీ కార్యాలయంలో బంధించారు. గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు మొసలిని వేరే చోటుకు తరలించారు.

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)