ఇలాంటి కెప్టెన్‌ను చూసిందిలేదు!

Published on Tue, 02/20/2018 - 10:28

సాక్షి, స్పోర్ట్స్‌ : ఓవర్‌సీస్‌లో అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటింగ్‌తో రాణిస్తున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ కెప్టెన్‌ సౌరవ్‌గంగూలీ ప్రశంసల జల్లు కురిపించారు.  ఓ జాతీయా చానెల్‌తో మాట్లాడుతూ..  ‘కోహ్లి పూర్తి స్థాయిలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ విజయాలు నమోదు చేసింది. త్వరలో పర్యటించే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కెప్టెన్‌గా తనేంటో తెలియజేస్తాడు. నేను కెప్టెన్‌గా ధోని, రాహుల్‌ ద్రవిడ్‌లను చూశా. కానీ ఇలా స్థిరంగా పరుగులు చేసే కెప్టెన్‌ను ఇప్పటి వరకు  చూడలేదు. కోహ్లి భారత క్రికెట్‌ జెండా వంటి వాడు. నేను క్రికెటర్లు అత్యద్భుత ఫామ్‌ కలిగిన సందర్భాలు ఎన్నో చూశా. వ్యక్తిగతంగా నాది, సచిన్‌, ద్రవిడ్‌లది కావొచ్చు. కానీ ఇది అలాంటిది కాదనుకుంటున్నా. ఇది ఓ జీనియస్‌ గొప్పతనమని భావిస్తున్నా.’ అని గంగూలీ వ్యాఖ్యానించారు.

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ చాలా ముందుగానే వెళ్లాలని దాదా కోహ్లిసేనకు సూచించాడు. ఈ సిరీస్‌లకు ముందే కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులు తెలుస్తాయని గంగూలీ చెప్పుకొచ్చాడు.  కెప్టెన్‌గా కోహ్లి ఓవర్‌సీస్‌లో భారత్‌కు టెస్ట్‌ సిరీస్‌ విజయాలను త్వరలోనే అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కోహ్లి ఓవర్‌సీస్‌లో చేలరేగుతూ రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆరు వన్డేల్లో ఏకంగా 558 పరుగులు చేసి భారత్‌కు చారిత్రాత్మక విజయం అందించాడు.

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)