‘నా కౌగిలింత పని చేసింది’

Published on Fri, 11/23/2018 - 14:58

చండీగఢ్‌ : నేను ఇచ్చిన ‘జప్పి’(కౌగిలింత) పనిచేసిందంటున్నారు భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ.  భారత్‌ – పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు పాక్‌ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిద్ధు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది ఆగస్ట్‌లో పాకిస్తాన్‌ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్ధూ.. పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కౌగిలింత గురించి సిద్ధూ ‘అతనే నా ముందుకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. కర్తార్‌పూర్‌లోని సాహిబ్‌ కారిడార్‌ తెరవడం గురించి మాట్లాడుకున్నామం’టూ సిద్ధూ వివరణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సాహిబ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకారం తెలపడంతో ‘నా కౌగిలింత ఫలించింది. కారిడార్‌ ఒపెన్‌ అయినప్పుడు ముద్దు ఇస్తానం’టూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సిద్ధూ.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర మాట్లాడుతూ.. ‘సిద్ధూ పంజాబ్‌ క్యాబినేట్‌ బదులు పాక్‌ క్యాబినేట్‌లో ఉన్నాడేమో అనిపిస్తుంది. భారతదేశానికి కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి పాక్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాడంటూ’ మండిపడ్డారు.

Videos

ఆగండి తమ్ముళ్లు.. జనం పరుగో పరుగు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య

ఇంత చెత్త వెధవ ఎక్కడా లేడు.. సతీష్ రెడ్డి సంచలన కామెంట్స్

ప్రజలు కష్టాల్లో ఉంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు సంబరాలా..?

Magazine Story: అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వానికి విజయోత్సవ సభ

కూకట్ పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ దారుణ హత్య

Big Question: మోసగాళ్ల బండారం బయటపెట్టిన జగన్

YS జగన్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పు చంద్రబాబు

నేపాల్ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన సుశీల కర్కి

తండైన మెగా హీరో.. వారసుడొచ్చాడు..!

Photos

+5

‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

భార్యతో వేకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న జవాన్ డైరెక్టర్‌ అట్లీ (ఫొటోలు)

+5

ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పుజారా దంపతులు (ఫొటోలు)

+5

చీరలో మెరిసిపోతున్న అలనాటి స్టార్ హీరోయిన్ మీనా (ఫొటోలు)

+5

ఇదే నా బెస్ట్ లైఫ్.. త్రిష పోస్ట్ వైరల్ (ఫొటోలు)

+5

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అవార్డ్ వేడుకలో బాలీవుడ్ బ్యూటీస్ (ఫొటోలు)

+5

అ‍త్తారిల్లు, భర్తతో టూర్స్.. నటి అభినయ ఆగస్ట్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఆసియా కప్‌-2025కి రె‘ఢీ’ అంటున్న కెప్టెన్లు.. హైలైట్‌గా సూర్య (ఫొటోలు)

+5

ఏపీలో కదం తొక్కిన రైతులు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో భారత మహిళా క్రికెటర్‌ శ్రీ చరణి (ఫొటోలు)