amp pages | Sakshi

హిందూ టెంపుల్ ఆఫ్ తల్లహాసీలో ఘనంగా దీపావళి వేడుకలు

Published on Thu, 10/24/2019 - 22:32

తల్లహాసీ : హిందూ టెంపుల్ ఆఫ్ తల్లహాసీ ( హెచ్‌టీటీ) ఆధ్వర్యంలో ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని తల్లహాసీ నగరంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.  800మందికి పైగా హాజరైన ఈ వేడక అత్యంత వినోదంగా సాగింది. ఈ  వేడుకలలో 80 మంది ఫుడ్ వాలంటీర్లు పాల్గొన్నారు. 12 లైవ్ ఫుడ్ స్టాల్సు లో 54 రకాల వంటకాల తో పసందైన విందుతో పాటు పిల్లలకు కోసం వినోద కార్యక్రమాన్ని  కూడా ఏర్పరిచారు. 22 అడుగుల ఎత్తు లో పదితలల రావణాసురుడి భారీ కటౌటు ఏర్పాటు చేసి దహనము చేసారు, ఆ రావణకాష్ట ధూమము మింటికి ఎగయగానే  అక్కడ చేరిన వారు భక్తి పారవశ్యం తో జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ అని చేసిన విజయ ఘోషలతో  రామ నామ స్మరణలతో ,మిరుమిట్లుగొలిపే బాణాసంచాతో దసరా రామలీల కార్యక్రమములు ముగిసాయి.

ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ సాయి శశిధర్ రెడ్డి చిన్నమల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి అవిశ్రామముగా పనిచేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీవారికి ,  వాలంటీర్లకి, ఈవెంట్ మరియు లోకల్ బిజినెస్ స్పాంసర్ల కు పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేసారు.తల్లహాసీ అంటే సెవన్ హిల్సు ( సప్తగిరి ) అని అక్కడి నేటివ్ రెడ్ ఇండియన్ పరిభాష లో అర్ధము. సప్తగిరి ఆఫ్ ద వెస్టు లో స్థిరపడిన ప్రవాస భారతీయులు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమము ను ప్రమోట్ చేసే ఫండ్ రైసింగ్ ప్రోగ్రాము లో ఓక బాగమే ఈ దసరా రామలీల. ఆనవాయితిగా గత 6 సంవత్సరాల నుండి ఈ మహోత్సవము నిర్విఘ్నముగా చేస్తున్నారు. 2000 కు పైగా హిందువుల ఫ్యామీలీలు ఉన్న ఆ సప్తగిరి నగరము లో అత్యుత్సాహంతో అక్కడ ప్రజలు ప్రతిపండుగ ను కన్నుల పండగ గా జరుపుకుంటూనే  తమ ఊరిలో ఓక దేవాలయము ఉండాలని, ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఈ సందర్భము గా ఆలయ నిర్మాణ ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి నందినేని మాట్లాడుతూ సప్తగిరి గా పిలువ బడుతున్న ఆఊరి లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని , తల్లహాసీ ప్రజలే కాక ఇతర సిటీల నుంచి స్నేహితులు భక్తులు కొన్ని సంస్థలు ముందుకు రావటముతో 20 ఏకరాల స్థలము కొన్నామని, 11500 చదరపు అడుగుల విస్తీర్ణంతో పలు వసతులతో కూడిన శ్రీవారి ఆలయ ఫేస్-1 నిర్మాణానికి 1.6 మిలియన్ డాలర్ల ఎస్టిమేషన్ లో ఇప్పటికే  1 మిలియన్ డాలర్ల విరాళాలు అందాయని, ఇంకొక 0.6 మిలియన్ డాలర్ల విరాళాలకు భక్తులు పలు సంస్థలు ముందుకు వచ్చి ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమము లో పాలుపంచుకోవాలని కోరారు. హిందు టెంపుల్ ఆఫ్ తల్లహాసీ స్వచ్ఛంధ సంస్థకు ఇచ్చే విరాళాల కు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. వివరాల కు ఇంకా ఆన్ లైన్ డోనోషన్ లకు టెంపుల్ వెబ్ సైటు చూడగలరు.

Videos

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

బెంగళూరు రేవ్ పార్టీ..బయటపడ్డ సంచలన నిజాలు..

బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?

రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..

శ్రీకాకుళంలో ఎగిరేది YSRCP జండానే..

తెలుగు ఓటర్లు కీలకం

Photos

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)