ఆగస్టులో కేబీసీ 8 ప్రారంభం: అమితాబ్

Published on Tue, 06/24/2014 - 12:14

అక్షరాలా కోటి రూపాయలను అందిస్తూ ఇప్పటివరకు ఏడు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన 'కౌన్ బనేగా కరోడ్పతి' కార్యక్రమం ఎనిమిదో సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆగస్టు నెలలో ఈ కార్యక్రమ ప్రసారాలను ప్రారంభిస్తున్నట్టు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపారు. 'కౌన్ బనేగా కరోడ్పతి' కొత్త ముఖం ఆగస్టులో ప్రసారం అవుతుందని ఆయన తెలిపారు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్, ఫేస్బుక్, ట్విట్టర్.. ఇలాంటి సామాజిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెబుతుంటారు. అలాగే ఈసారి కూడా ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మీడియాతోనే చెప్పారు.

''ఇది కేబీసీ కొత్త ఆకారం. కేబీసీ కొత్త ముఖం ఆగస్టులో ప్రారంభం అవుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా జరిగాయి. ఒక్క సీజన్ మాత్రం షారుక్ఖాన్ చేశారు'' అని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. తానెంత పెద్ద నటుడైనా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ గేమ్షోకు వచ్చేవారిని ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ వారిని ప్రోత్సహించి, అనేకమందిని ఇప్పటికి కోటీశ్వరులను చేశారు. ''ఇక్కడ కేవలం డబ్బులు మాత్రమే కాదు.. హృదయాలు కూడా గెలచుకుంటారు. ప్రతి ఒక్క పోటీదారు నా హృదయాన్ని గెలుచుకుని  వెళ్తుంటారు.. మీ అందరికీ ప్రేమతో'' అంటూ అమితాబ్ పోస్ట్ చేశారు. సోనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ షోను ప్రసారం చేయనుంది. కేబీసీ స్ఫూర్తితోనే తెలుగులో నాగార్జున హోస్ట్గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్షో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పటివరకు అత్యధికంగా 12.50 లక్షలను మాత్రమే గెలుచుకోగలిగారు.

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)