More

సీబీఐ రగడ : సుప్రీంను ఆశ్రయించిన అలోక్‌ వర్మ

24 Oct, 2018 11:18 IST

సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదం సర్వోన్నత న్యాయస్ధానం ముందుకు చేరింది. తనను డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తప్పించి అకారణంగా సెలవుపై పంపడం పట్ల అలోక్‌ వర్మ న్యాయపోరాటం చేపట్టారు. సీబీఐ చీఫ్‌గా తనను తొలగించిన ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అలోక్‌ వర్మ పిటిషన్‌ను శుక్రవారం విచారించనున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. కాగా, అలోక్‌ వర్మతో పాటు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానాలను ప్రభుత్వం రాత్రికిరాత్రి సెలవుపై పంపిన విషయం తెలిసిందే. మరోవైపు ముడుపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానాను కాపాడేందుకే అలోక్‌ వర్మను తొలగించారని కాంగ్రెస్‌ ఆరోపించింది. నూతన సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ఒడిషా క్యాడర్‌కు చెందిన తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావును నియమించింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఏ ఒక్కరినీ వదిలిపెట్టం! అధికారులకు కాంగ్రెస్‌ చీఫ్‌ వార్నింగ్‌

ఏటీఎంకు నిప్పు.. తెరుచుకోలేదని తగలబెట్టేశాడు!

ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే కమిటీ: ప్రధాని మోదీ

Uttarakhand: యూసీసీకి సిద్ధం!

సూరత్‌లో ‘దీపావళి ‍ప్రయాణికుల’ తొక్కిసలాట.. పలువురికి అస్వస్థత!