ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాక గానీ.. తెలిసిరాలేదు!

Published on Tue, 12/08/2015 - 16:58

న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో అది వాహనదారులకు నరకం చూపించే రోడ్డు. ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌లో ఎవ్వరైనా గంటలు, గంటలు మగ్గిపోవాల్సిందే. ఆ నరకం ఏ స్థాయిలో ఉంటుందో తాజాగా సాక్షాత్తు ఓ కేంద్రమంత్రికి రుచి చూపించింది. రెండు గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌లో మగ్గిపోయిన ఆ కేంద్రమంత్రికి అసలు సమస్య తెలిసిరావడంతో 24 గంటల్లో పరిష్కారం ఏంటో కనుగొనండంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వివరాలివి..

కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాత్రి  ఢిల్లీ శివార్లలోని గుర్గావ్-మహిపాల్‌పూర్ ఫ్లైఓవర్‌ పై ప్రయాణించారు. విమానాశ్రయానికి వెళ్లాలంటే ఈ ఫ్లైఓవర్‌ మీదుగానే వెళ్లాలి. కానీ దానిపై వాహనాల రాకపోకలు స్తంభించడంతో ఆయన రెండు గంటలపాటు మగ్గిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో కంగుతిన్న గడ్కరీ జాతీయ హైవే అథారిటీ అధికారులకు ఫోన్ చేసి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడకుండా 24 గంటల్లో తన ముందు ప్రతిపాదనలు పెట్టాలని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి.

మొత్తానికి గడ్కరీ ఢిల్లీలో ట్రాఫిక్  సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 'ఢిల్లీ ట్రాఫిక్ గురించి మేం అధ్యయనం చేస్తున్నాం. దీనిపై 15 రోజుల్లో నివేదిక రానుంది. ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయే ప్రదేశాలను మేం గుర్తించనున్నాం. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి కూడా తెలియజేసి.. దాదాపు ఆరు నెలలు, ఏడాదికాలంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మేం సంయుక్తం చర్యలు తీసుకుంటాం' అని గడ్కరీ విలేకరులకు చెప్పారు.
 

Videos

ఏపీలో కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో వేగం పెంచిన కమిషన్

గొర్రెల స్కామ్ పై ఈడీ ఫోకస్

టీడీపీపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం

నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

పదవులపై ఉత్కంఠ.. ఎవరికి ఏ శాఖలు ?

ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభం

కుటుంబ సమేతంగా తిరుమలకు చంద్రబాబు

తన కొడుకుని బస్సులో ఎక్కించుకోలేదని మహిళ ఏం చేసిందంటే ?

బస్సులో రచ్చ రచ్చ..

Photos

+5

Hariteja Photos: నటి హరితేజను ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)

+5

Samantha: ఆశ్రమంలో సమంత.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

ధమాకా రిపీట్‌.. రవితేజతో మరోసారి జోడీ కడుతున్న శ్రీలీల (ఫోటోలు)

+5

తిరుమల స్వామివారి సేవలో సినీతారలు (ఫోటోలు)

+5

యాపిల్ WWDC 2024 ఈవెంట్ (ఫొటోలు)

+5

Priya Anand: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ప్రియా ఆనంద్ (ఫొటోలు)

+5

Sreeleela : రెట్రో షేడ్స్ లుక్స్‌తో శ్రీలీల.. మరో సావిత్రి అంటూ కామెంట్స్! (ఫొటోలు)

+5

మనం గెలిచాం: అనుష్క శర్మతో కలిసి ధనశ్రీ ఫోజులు (ఫొటోలు)

+5

Mahishivan: సీరియల్‌ నటి మహేశ్వరి కుమారుడి ఊయల ఫంక్షన్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్.. 'సుందర్ పిచాయ్' సక్సెస్ జర్నీ & లవ్ స్టోరీ (ఫొటోలు)