amp pages | Sakshi

వాళ్లతో నా షూ లేసులు విప్పించుకుంటా..!

Published on Sun, 05/05/2019 - 13:46

లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ సీనియర్‌ నేత మేనకా గాంధీ ఈసీ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తనయుడు, సుల్తాన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మేనకా తరపున సుల్తాన్‌పూర్‌లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులపై విమర్శలు చేసేక్రమంలో నోరుజారారు. ప్రతిపక్ష నాయకులతో తన షూ లేసులు విప్పించుకుంటానని వ్యాఖ్యానించారు. తమది నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ అని పరోక్షంగా చెప్పుకున్న వరుణ్‌ సుల్తాన్‌పూర్‌ బీఎస్పీ అభ్యర్థి చంద్ర భద్ర సింగ్‌ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మనం దేవుడికి తప్ప ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం నేనున్నా. నేను సంజయ్‌ గాంధీ తనయున్ని. మన పట్ల అగౌరంగా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు. అలాంటి వారితో నా షూ లేసు విప్పించుకుంటా. నా ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ప్రజలు మోనూ, సోనూలను చూసి భయపడొద్దు’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన చంద్ర భద్ర సింగ్‌ని స్థానికులు సోనూ సింగ్ అని పిలుస్తారు. ఆయన సోదరుడు మోనూ సింగ్‌కి స్థానికంగా పేరుంది. వరుణ్ గాంధీ ప్రసంగించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఓ రాజకీయ నేత అయివుండీ నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్టు కాదని నెటిజన్లు మండిపడుతన్నారు. ఫ్రస్ట్రేషన్‌లో ఉండటం వల్లే ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. వరుణ్‌ ఫిలిబిత్‌ నుంచి  పోటీ చేస్తున్నారు.

Videos

బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?

రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..

శ్రీకాకుళంలో ఎగిరేది YSRCP జండానే..

తెలుగు ఓటర్లు కీలకం

కడుపు మంటతోనే టీడీపీ దాడులు

ఎన్నికల తర్వాత.. బాబు, పవన్, పురందేశ్వరి సైలెంట్: KSR

"డ్రగ్స్ పార్టీలో హేమ" నిర్ధారించిన పోలీసులు

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)