మానవత్వం మనిషి రూపులో..

Published on Sun, 05/29/2016 - 09:27

ఆయనేమీ ధనవంతుడు కాదు.. 15 ఏళ్ల వయసులో పొట్టకూటి కోసం పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.. జీవన పోరాటంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చివరకు అహ్మదాబాద్ వీధుల్లో రిక్షాపై తిరుగుతూ ముత్యాల హారాలు అమ్మే వీధి వ్యాపారిగా స్థిరపడ్డాడు. అయితే నేం మూర్తీభవించిన మానవత్వానికి తాను ప్రతిరూపమని నిరూపించుకున్నాడు మిథాలాల్ సింధీ.

నా అనేవారు ఎవరూ లేని అనాథ శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు జరిపిస్తుంటాడు. ఇలా ఆరు దశాబ్దాల కాలంలో 550 అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపించాడు. ఫుట్ పాత్‌పై తన సహచరుడు మరణించినప్పుడు దహన సంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రారంభమైన ఈ సేవ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

‘అనాథ శవం ఉందని సమాచారం రాగానే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి శరీరంపై మతపరమైన ఆనవాళ్లేమైనా ఉన్నాయేమో పరిశీలిస్తాను. ఏ మతస్తుడో తెలిస్తే ఆ మతపరమైన విధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తాను’ అని మిథాలాల్ చెబుతున్నాడు. ఒక్కో శవం అంత్యక్రియలకూ మిథాలాల్‌కు కనీసం రూ.15 వందలు ఖర్చవుతుంది. ముత్యాల హారాలు అమ్ముతూ సమకూర్చుకున్న మొత్తాన్నే అందుకు వినియోగిస్తుంటాడు. 83 ఏళ్ల మిథాలాల్ గత 60 ఏళ్లుగా ఫుట్ పాత్‌పైనే జీవిస్తున్నాడు.
 

Videos

YSRCP కాదు.. పక్కా జనసేన.. వాడికి పవన్ అంటే పిచ్చి.. అజయ్ దేవ్ చెల్లి షాకింగ్ నిజాలు

ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో

హిప్పో జర తప్పుకో, ఈ సెక్యూరిటీ ధైర్యానికి సలాం!

ఆంధ్రా కిమ్ నారా లోకేష్

పవన్ పీకింది చాలు! డిప్యూటీ సీఎంవా.. ఆకు రౌడీవా!

మార్కెట్లోకి Ai వాషింగ్ మిషన్లు

ఆడవారి దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి లేదు

పొట్టు పొట్టు కొట్టుకున్న ఇప్పటం జనసేన నేతలు

శభాష్ ఇస్రో.. YS జగన్ ప్రశంసలు

శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..

Photos

+5

వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)

+5

#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)

+5

మహేష్‌ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్‌

+5

అదరగొట్టిన విల్లా మేరీ కాలేజ్ విద్యార్థినులు (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కోలీవుడ్ స్టార్‌ కమెడియన్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైఎస్ జగన్‌ ప్రజాదర్బార్‌: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)

+5

నా సూపర్‌స్టార్‌: భార్యకు సంజూ శాంసన్‌ విషెస్‌ (ఫొటోలు)