మల్లిగాడు ఫుల్‌గా నవ్విస్తాడు

Published on Mon, 09/30/2013 - 02:22

‘‘ఈ మధ్య మాస్ సినిమాలు ఎక్కువగా చేయడంతో కొంచెం విసుగు అనిపించింది. వినోద ప్రధానంగా సాగే సినిమా చేస్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో ఉదయ్‌రాజ్ ఓ కథ చెప్పాడు. చాలా నచ్చింది.  క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా చిత్రాల తర్వాత బ్రహ్మానందంగారి కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాను. ఈ సినిమా ఫుల్‌గా నవ్విస్తుంది’’ అన్నారు శ్రీకాంత్. 
 
 ఉదయ్‌రాజ్ .ఎ దర్శకత్వంలో మల్లెల సీతారామరాజు, స్వాతి పిల్లాడి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. శ్రీకాంత్, మనోచిత్ర నాయకా నాయికలు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పెళ్లి సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘రచయితగా శ్రీకాంత్‌తో ప్రారంభమైన నా కెరీర్ దర్శకుడిగా కూడా ఆయనతోనే ప్రారంభం కావడం ఆనందంగా ఉంది.
 
 హీరో మ్యారేజ్ బ్యూరో ఎందుకు నడుపుతాడు? అనేది ఆసక్తికరమైన అంశం’’ అన్నారు. వచ్చే నెల 5 నుండి చిక్‌మగళూర్, హంపీల్లో పాటలను చిత్రీకరించాలనుకుంటున్నామని, సినిమా బాగా వస్తోందని మల్లెల సీతారామరాజు చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో మనోచిత్ర, రఘురామ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
 

Videos

నిజం బయటపెట్టిన సింగయ్య వీడియో

KSR Live Show: డ్రైవర్ పై ఒత్తిడి.. అబద్ధపు వాగ్మూలంతో జగన్ ను ఇరికించేందుకు కుట్ర..!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో వంటింట్లో గ్యాస్ బాంబ్

భగ్గుమన్న పల్నాడు.. యువత పోరులో లాఠీచార్జి

విశాఖలో భారీ ఎత్తున యువత పోరు..

వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు..

యువత పోరు.. భారీ ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తుతున్న ఏపీ

Yuvatha Poru: రోజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

టీడీపీ మహిళా నేతకు అవమానం

సూర్యాపేటలో గ్యాంగ్ వార్

Photos

+5

బర్త్ డే వెకేషన్.. ఫ్యామిలీతో కలిసి కాజల్ ఎంజాయ్ (ఫొటోలు)

+5

'కుబేర' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వర్షాకాలం వచ్చే.. తడిసి ముద్దయిపోతున్న రష్మీ (ఫొటోలు)

+5

‘కన్నప్ప’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 22-29)

+5

Divi: స్వామిని చూస్తే చాలు.. బాధలు పోతాయ్.. (ఫొటోలు)

+5

Kaushik Reddy Arrest: వరంగల్ సుబేదారి పీఎస్ వద్ద ఉద్రిక్తత

+5

'కుబేర' జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

దేశవ్యాప్తంగా యోగా డే వేడుకలు.. ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

IND Vs ENG: ఇంగ్లండ్‌ గడ్డపై అదరగొట్టిన భారత బ్యాటర్లు.. పట్టుబిగించిన ‘గిల్‌’ సేన (ఫొటోలు)