మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఆండాళ్ గలాటా
Published on Tue, 03/18/2014 - 00:24
‘‘ఇందులో నా పేరు ఆండాళ్. పేరుకు తగ్గట్టే సంప్రదాయబద్ధంగా, ఫన్నీగా ఉంటుంది నా పాత్ర. కథ, నా పాత్ర వినగానే... వెంటనే ‘ఓకే’ చెప్పేశాను. ఆద్యంతం సరదాగా సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని హరిప్రియ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా రూపొందిన చిత్రం ‘గలాటా’. కృష్ణ దర్శకుడు. డి.రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించి, తొలి ప్రతిని సురేందర్‌రెడ్డికి అందించారు. వారితో పాటు కె.అచ్చిరెడ్డి, కేఎల్ దామోదరప్రసాద్ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
‘‘తొలి సినిమాతోనే అలీ, సాయికుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్టులను డెరైక్ట్ చేసే అవకాశం రావడం తన అదృష్టం’’ అని దర్శకుడు చెప్పారు. ఇందులో తనది రాజకీయ నాయకుని పాత్ర అని, మేరా భారత్ మహాన్ అంటూ తానేం చేశాననేది ఇందులో ఆసక్తికరమైన అంశమని సాయికుమార్ పేర్కొన్నారు. దర్శకుడు కృష్ణకు పేరు తెచ్చే సినిమా ఇదని చిత్ర సమర్పకుడు చావలి రామాంజనేయులు నమ్మకం వ్యక్తం చేశారు. శ్రీ మాట్లాడుతూ -‘‘నా కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. చక్కని ప్లానింగ్‌తో దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని చెప్పారు.
#
Tags : 1