Breaking News

బాషా... త్రీజీ బాషా... నేనూ ఆటోవాణ్ణే!

Published on Sat, 11/11/2017 - 00:31

‘బాషా’... రజనీకాంత్‌! మరి, ‘త్రీజీ బాషా’ ఎవరు? ‘త్రీజీ’ అంటే... ‘థర్డ్‌ జనరేషన్‌’. ఇన్‌సెట్‌ ఫొటోలో... బుల్లి ఆటోలో ఏముందోనని తీక్షణంగా చూస్తున్న బుల్లి బాబే త్రీజీ బాషా! రజనీకాంత్‌ మనవడు. పేరు... వేద్‌. రజనీ రెండో కుమార్తె సౌందర్యా రజనీకాంత్‌ కుమారుడు. ఈ బుడతడు బాషా ఏంటనుకుంటున్నారా? ‘బాషా’లో రజనీకాంత్‌ ఏం చేశారు? కొన్ని సన్నివేశాల్లో ఆటో నడుపుతూ కనిపించారు. ఇప్పుడు వేద్‌ కూడా ఆటో నడుపుతున్నారు.

అయితే... వేద్‌ది బుల్లి ఆటో! బుల్లి బాబు కదా మరి! ‘నాన్‌ ఆటో కారన్‌.. ఆటో కారన్‌ (‘బాషా’లో నేను ఆటోవాణ్ణి... ఆటోవాణ్ణి పాట గుర్తుండే ఉంటుంది)! జస్ట్‌ లైక్‌ తాత’’ అని సౌందర్యా రజనీకాంత్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆటోలతో ఆడు కుంటున్న వేద్‌ పెదై్దన తర్వాత తాతయ్యలా హీరో అయ్యి, సినిమాల్లో ఆటో నడుపుతాడేమో? ‘బాషా... త్రీజీ బాషా... నేనూ ఆటోవాణ్ణే’ అని డైలాగులు చెబుతాడేమో!

పుట్టినరోజున పార్టీ అనౌన్స్‌మెంట్‌?
డిసెంబర్‌ 12... రజనీకాంత్‌ పుట్టినరోజు. అదే రోజున రజనీ తన రాజకీయ ప్రణాళికలు, స్థాపించబోయే పార్టీ, ఇతర అంశాల గురించి అభిమానుల సమక్షంలో ప్రకటిస్తారని చెన్నైలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా రజనీ పుట్టినరోజుకి ముందు ఇటువంటి ప్రచారాలు రావడం సాధారణమే. అయితే... ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ శూన్యత నెలకొన్న దృష్ట్యా ఈ ప్రచారానికి ప్రాముఖ్యత లభిస్తోంది. రజనీ ఏమంటారో మరి? వెయిట్‌ అండ్‌ సీ!!

Videos

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Photos

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)