Breaking News

నిజమైన కత్తితోపొడిచేసింది!

Published on Sat, 05/17/2014 - 23:37

ఒక్కోసారి సినిమా షూటింగుల్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఇటీవల ‘ఏక్ విలన్’ సినిమా షూటింగులో ఇలాంటి పొరపాటే ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,  ప్రధాన తారాగణమైన శ్రద్ధాకపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ పాల్గొనగా కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మోహిత్ సూరి. అవసరార్థం కొన్ని నకిలీ ఆయుధాలను కూడా తెప్పించారు. అయితే... ఆ నకిలీ ఆయుధాల మధ్య నిజమైన ఆయుధం కూడా ఒకటి ఉంది.

అది తెలీని శ్రద్ధాకపూర్... ఆ నిజమైన ఆయుధాన్నే చేతిలో పట్టుకొని, ఎదురుగా ఉన్న స్టంట్‌మేన్‌తో సరదాగా యుద్ధ విన్యాసం చేయడం మొదలుపెట్టింది. అది నకిలీ ఆయుధమే అనుకొని ఆ స్టంట్‌మెన్‌ని గట్టిగా పొడిచేసింది. ఇంకేముంది... క్షణాల్లో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. లొకేషన్ మొత్తం గందరగోళం. తీవ్రంగా గాయపడ్డ ఆ స్టంట్‌మేన్‌ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇక శ్రద్ధాకపూర్ అయితే... కళ్ళ ముందు ఏం జరుగుతోందో తెలియనంత షాక్‌లోకి వెళ్లిపోయింది. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అనే వార్త చెవిన పడే వరకూ ఆమె మనిషి కాలేదు. ఎట్టకేలకు ఆ స్టంట్ మేన్‌కు ప్రమాదం తప్పడంతో యూనిట్ మొత్తం ఊపిరి పీల్చుకుంది.
 

Videos

అటు పార్టీలోనూ...ఇటు ప్రభుత్వంలోనూ డాడీని డమ్మీని చేస్తున్న లోకేశ్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి ఓవరాక్షన్

నమ్మించి నట్టేట ముంచారు చంద్రబాబుపై మహిళలు ఫైర్

ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతల హౌస్ అరెస్టులు

Rain Alert: వారం రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు

Charminar Gulzar House: ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి

డోర్ లాక్ పడి..నలుగురు చిన్నారులు మృతి

Nagarjuna Yadav: రైతులపై పగ.. పెట్టుబడి సాయం జీరో, రైతు భరోసా జీరో

KSR Paper Analysis: ఈరోజు ముఖ్యాంశాలు

TDP నేతల చేతిలో దాడికి గురై.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జేమ్స్

Photos

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)