పదకొండు భాషల తారలతో సంతోషంగా అవార్డుల వేడుక

Published on Sun, 09/01/2013 - 23:56

11 భాషలకు చెందిన సినీ ప్రముఖుల ఆగమనంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం కళకళలాడింది. ‘సంతోషం’ సినీ వారపత్రిక 11వ వార్షికోత్సవ వేడుక ఈ తారల ఆగమనానికి వేదిక అయ్యింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘సంతోషం ఫిలిం అవార్డు వేడుక’ను ఆ పత్రిక సంపాదకుడు, నిర్మాత సురేష్ కొండేటి ఘనంగా నిర్వహించారు.
 రెండేళ్ల క్రితం వరకూ తెలుగు సినిమాకే పరిమితమైన ఈ అవార్డు వేడుకను... గత ఏడాదితో దక్షిణభారతానికి చెందిన అన్ని భాషలకూ విస్తరింపజేశారు సురేష్. అయితే... ఈ ఏడాది అంతకంటే ఘనంగా... దేశంలోని 11 భాషల చిత్రాలకు ఈ అవార్డులను అందించారు సురేష్. 2012వ సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డు వేడుకలో తెలుగు సినిమాకు గాను ఉత్తమనటునిగా మహేష్‌బాబు (బిజినెస్‌మేన్), ఉత్తమనటిగా సమంత(ఈగ) అవార్డులను గెలుచుకున్నారు.
 
 ఇంకా వివిధ భాషల్లోని పలువురు సినీ ప్రముఖులకు సంతోషం అవార్డులు వరించాయి. దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, కృష్ణ, కృష్ణంరాజు, జమున, వాణిశ్రీ, విజయనిర్మల, జయంతి,  వెంకటేష్, రవిచంద్రన్, డా.రాజేంద్రప్రసాద్, రామ్‌చరణ్, రానా, ఆర్.నారాయణమూర్తి, గీతాంజలి, రోజారమణి, రావు బాలసరస్వతి, తార, మమతామోహన్‌దాస్, హన్సిక, నిఖిషాపటేల్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చార్మి, అక్ష, రేష్మ, అభినయల నాట్యం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా... కృష్ణంరాజు, వాణిశ్రీ కూడా ఈ వేడుకపై కలిసి స్టెప్పులేయడం విశేషం.
 

Videos

డిప్యూటీ సీఎం పవన్‌ ఛాంబర్‌

హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వాన

టీడీపీకి బంపర్ ఆఫర్..ఈ పదవి బీజేపీకి దక్కితే టీడీపీకే నష్టం..

శాంతి వద్దు రక్త పాతమే ముద్దు అంటున్న టీడీపీ నేతలు చంపుతాం అంటూ బెదిరింపులు

‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’

నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ

అసెంబ్లీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ కీలక సమావేశం

రైలు ప్రమాదంలో 15కు చేరిన మృతుల సంఖ్య

బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..

రాత్రి వేళల్లోనూ విశాఖ బీచ్ ల్లో పర్యాటకుల సందడి

Photos

+5

ఇద్దరూ టెకీలే: క్రికెటర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)

+5

Father's Day 2024: స్టార్‌ క్రికెటర్లైన తండ్రి కొడుకులు (ఫొటోలు)

+5

నాన్న ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్లు.. క్యూట్ ఉన్నారు కదా! (ఫొటోలు)

+5

ఫాదర్స్‌ డే : నాన్నను మురిపించిన స్టార్స్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ - బ్యూటిఫుల్ ఫోటోలు

+5

ఇటలీలో జీ-7 సదస్సులో పలు దేశాల ప్రముఖులతో ప్రధాని మోదీ (ఫొటోలు)

+5

అనంత్‌ ప్రేమంతా రాధిక గౌను మీదే..! వైరల్‌ ఫొటోలు

+5

USA: కూతురితో కలిసి ఇసుక గూళ్లు కట్టిన రోహిత్‌ శర్మ (ఫొటోలు)