amp pages | Sakshi

శశికుమార్, నానిలతో ద్విభాషాచిత్రం?

Published on Wed, 07/05/2017 - 17:15

చెన్నై: తమిళనటుడు శశికుమార్, తెలుగు నటుడు నానిలతో దర్శకుడు సముద్రఖని ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. నటుడు, దర్శకుడు అంటూ జోరు గుర్రాల స్వారీ చేస్తున్న సముద్రఖని ఇటీవల స్వీయ దర్శకత్వంలో నటించిన అప్పా, తొండన్‌ చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. మరో పక్క ఇతర చిత్రాలలో ముఖ్య పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న సముద్రకని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

ఈయన తమిళంలో దర్శకత్వం వహించిన నాడోడిగళ్‌ చిత్రాన్ని తెలుగులో శంభో శివ శంభో పేరుతో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అదే విధంగా జయంరవి ద్విపాత్రాభినయం చేసిన నిమిర్న్‌దు నిల్‌ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందించారు. తెలుగులో జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కిన ఇందులో నాని కథానాయకుడిగా నటించారు.

ఇదే విధంగా మరో సారి సముద్రకని ద్విభాషా చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. ఇందులో తమిళవెర్షన్‌లో శశికుమార్, తెలుగులో నాని హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం నిన్నుకోరి శుక్రవారం తెరపైకి రానుంది. కాగా నాని అక్కడ వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. సముద్రకని దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తారన్న విషయం గురించి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అదే విధంగా శశికుమార్‌ ప్రస్తుతం కొడివీరన్‌ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Videos

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి

సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు

"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..

దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..

అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు

ఏపీలో అల్లర్లు చేసింది వీరే..

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)