Breaking News

మతం మార్చుకున్న మోనిక

Published on Fri, 05/30/2014 - 23:31

తమిళ చిత్రాల్లో పేరు తెచ్చుకున్న నటి మోనిక ఇప్పుడు ఇస్లామ్ మతం స్వీకరించారు. అందుకు తగ్గట్లే తన పేరును ఎం.జి.రహీమాగా మార్చుకున్నారు. ఇకపై, సినిమాల్లో నటించనంటూ, నటనకు గుడ్‌బై చెప్పేశారు. ఈ హఠాత్పరిణామానికి కారణం ఏమిటన్నది ఆమె చెప్పలేదు కానీ, మతం మార్చుకున్న విషయాన్ని శుక్రవారం నాడు చెన్నైలో పత్రికా విలేకరులకు తెలియజేశారు. చిన్న వయసులోనే బాలనటిగా మొదలుపెట్టి నాయిక పాత్రల దాకా ఎదిగిన మోనిక తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 70 దాకా చిత్రాల్లో నటించారు.

‘‘బాల నటిగా మొదలైన నేను ఇన్నేళ్ళుగా సినీ రంగంలో విజయవంతంగా కొనసాగడానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు. ఈ రంగాన్ని వదిలివెళ్లడం కష్టంగా ఉన్నా, తప్పడం లేదు’’ అని ఆమె ప్రకటించారు. అదే సమయంలో, ‘‘డబ్బు కోసమో, ఏదో ప్రేమ వ్యవహారం కోసమో నేను మతం మార్చుకోలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు. ఇస్లామ్‌లోని అంశాలు నచ్చడం వల్లే మతం మారాను’’ అని మోనిక వివరించారు. పెళ్ళి గురించి వివరాలను త్వరలోనే చెబుతానని ఆమె అన్నారు. వెంకటేశ్ సూపర్ హిట్ ‘చంటి’ (1991)లో, తమిళ ‘సతీ లీలావతి’ (’95)లో బాల నటిగా చేసిన మోనిక పెద్దయ్యాక తెలుగులో ‘శివరామరాజు’, ‘మా అల్లుడు వెరీగుడ్’, ‘కొడుకు’, ‘పైసాలో పరమాత్మ’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన మూడు తమిళ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. సినిమాల్లోకి వచ్చాక మోనికగా పేరు మార్చుకున్న రేఖా మారుతీరాజ్ ఇప్పుడిలా ఇస్లామ్ మతం పుచ్చుకోవడంతో మరోసారి పేరు మారినట్లయింది.
 

#

Tags : 1

Videos

నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)