‘లౌక్యం’ తర్వాత ‘శమంతకమణి’

Published on Thu, 07/20/2017 - 23:20

నిర్మాత వి.ఆనంద ప్రసాద్‌

‘‘శమంతకమణి’ సినిమా మా భవ్య క్రియేషన్స్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. మా సంస్థలో ‘లౌక్యం’ చిత్రం తర్వాత 100 శాతం ప్రేక్షకులు బావుందని చెప్పిన సినిమా ‘శమంతకమణి’. కుటుంబమంతా కలిసి చూసే కథ. త్వరలో విజయయాత్ర చేయనున్నాం’’ అని నిర్మాత వి.ఆనంద ప్రసాద్‌ అన్నారు. నారా రోహిత్, సందీప్‌ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘శమంతకమణి’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ – ‘‘మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌.

ఈ సినిమాలో నటించిన నా మిత్రులతో మరో సినిమా చేస్తా’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో చేసిన కార్తీక్‌ క్యారెక్టర్‌ నాకు చాలా మెమరబుల్‌.’’ అన్నారు ఆది. ‘శమంతకమణి’ సినిమాకి వస్తున్న ప్రేక్షకుల ఆదరణ మా అందరి గెలుపుగా భావిస్తున్నాం’’ అని సందీప్‌ కిషన్‌ చెప్పారు. ‘‘ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. ఇలాంటి ఓ పాత్ర నాకు ఇచ్చినందుకు శ్రీరామ్‌ ఆదిత్యకు, ఇటువంటి చిత్రం తీసిన ఆనందప్రసాద్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు నారా రోహిత్‌. ‘‘నా కల నిజం చేసిన మా హీరోలకు స్పెషల్‌ థ్యాంక్స్‌’’ అన్నారు శ్రీరామ్‌ ఆదిత్య.

Videos

జనసేనకు 4 మంత్రి పదవులు..

ఈ గ్రామంలో పెన్షన్లు లేపేస్తున్న.. టీడీపీ బెదిరింపులు

రైతులకు గుడ్ న్యూస్..తొలి సంతకం చేసిన ప్రధాని మోదీ

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోతున్న TNSF నేతలు

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు... విచారణ వేగవంతం

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పై సందర్శకులు ఫైర్

ఈ సినిమాతో మేమిచ్చే మెసేజ్ ఇదే..

రైనీ డే కావాలి.. రెడ్ అలర్ట్ లో షూట్

ఏపీలో జోక్యం చేసుకుంటారా ?

సుధీర్ గురించి అడగ్గానే హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)